Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstasr-lifestyle0e7766e0-b8dc-4057-a129-144375ad6a29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstasr-lifestyle0e7766e0-b8dc-4057-a129-144375ad6a29-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సినీ తారలు కూడా దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన కొణిదెల తో కలిసి వినూత్నంగా వేడుక జరుపుకున్నారు.మన కుటుంబ సంస్కృతులను, సంప్రదాయాలను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంటుంది. అలాంటి బాధ్యతను అద్భుతంగా నెరవేర్చారు ఉపాసన కామినేని కొణిదెల, ఆమె భర్త, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి వారు దసరా ఉత్సవాలను జరుపుకున్నారు. ఉపాసsocialstasr lifestyle{#}Upasana;Stree;WOMEN;festival;Pawan Kalyan;Vijayadashami;Dussehraదసరా పర్వదినాన్ని అక్కడ జరుపుకున్న రాంచరణ్ -ఉపాసన దంపతులు....!!దసరా పర్వదినాన్ని అక్కడ జరుపుకున్న రాంచరణ్ -ఉపాసన దంపతులు....!!socialstasr lifestyle{#}Upasana;Stree;WOMEN;festival;Pawan Kalyan;Vijayadashami;DussehraMon, 23 Oct 2023 22:30:00 GMTతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సినీ తారలు కూడా దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన కొణిదెల తో కలిసి వినూత్నంగా వేడుక జరుపుకున్నారు.మన కుటుంబ సంస్కృతులను, సంప్రదాయాలను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంటుంది. అలాంటి బాధ్యతను అద్భుతంగా నెరవేర్చారు ఉపాసన కామినేని కొణిదెల, ఆమె భర్త, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి వారు దసరా ఉత్సవాలను జరుపుకున్నారు.

ఉపాసన కుటుంబం తరఫున వచ్చిన ఓ సంస్కృతిని ఆచరించి కొనసాగించారు రామ్‌చరణ్‌. బాలికా నిలయం సేవా సమాజ్‌లోని అమ్మాయిలతో కలిసి దసరా పర్వదినాన్ని జరుపుకున్నారు. ఉపాసన బామ్మ, ఈ సేవా సమాజ్‌కి మూడు దశాబ్దాలకు పైగా ఆసరాగా ఉన్నారు. ఆమెకు ట్రిబ్యూట్ ఇచ్చేలా ఉపాసన, రామ్‌చరణ్ కలిసి బాలికా నిలయం సేవా సమాజ్ లోని అనాథ బాలికలతో కలిసి ఉత్సవాన్ని జరుపుకున్నారు. ప్రేమను పంచాలి. సానుకూల దృక్పథాన్ని సమాజంలో నాటాలి, సంతోషంగా జీవించాలనే ఆలోచనలను బాలికలలో పెంపొందించేలా స్టార్ కపుల్ ఈ పర్వదినాన్ని నిర్వహించుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని అత్యంత వైభవంగా చాటిచెప్పారు.

ఉపాసన, రామ్‌చరణ్ దంపతులకు ఇటీవల పండంటి ఆడబిడ్డ మెగా ప్రిన్సెస్ క్లింకార జన్మించిన విషయం తెలిసిందే. తరతరాలుగా వస్తున్న సంస్కృతులను, సంప్రదాయాలను గౌరవిస్తూ, కుటుంబ విలువలను పరిరక్షించుకునేలా స్టార్ కపుల్ పండుగను చేసుకున్న తీరుకు అందరూ ముచ్చటపడుతున్నారు. స్త్రీ శక్తిని ప్రశంసించేలా, ప్రోత్సహించేలా, కొనియాడేలా పర్వదినాన్ని జరుపుకున్నారు ఉపాసన చరణ్ దంపతులు. మహిళా సాధికారతను అత్యంత అద్భుతంగా కొనియాడే పండుగ దసరా. స్త్రీశక్తికున్న ప్రాధాన్యతను నవరాత్రుల్లో వర్ణించే శోభ ఈ పండుగ సొంతం. ఆ స్ఫూర్తిని జనాలకు పంచేలా ఈ పర్వదినాన్ని జరుపుకున్నారు ఉపాసన, రామ్‌చరణ్ దంపతులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>