Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-6b22f3e5-f6cc-41eb-93c6-a9f1431db819-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-6b22f3e5-f6cc-41eb-93c6-a9f1431db819-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా బిగ్ బాస్ ఏడవ సీజన్ అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే. మునుపటి సీజన్లతో పోల్చి చూస్తే కొత్త కొత్త టాస్కులు సరికొత్త ట్విస్టులతో ఈ షో రసవతంగా సాగుతూ ఉంది. అయితే బిగ్ బాస్ సెవెన్ సీసన్ లోకి అడుగుపెట్టిన లేడీ కంటెస్టెంట్స్ కి ఏదైనా శాపం తగిలిందా అంటే మాత్రం.. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తే అందరూ అవును అని అంటున్నారు. ఎందుకంటే షో మొదలైన నాటి నుంచి కూడా ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్ జరిగాయి. అయితే ఈ ఏడు ఎలిమినేషన్స్ లో కూడా హౌస్ నుంచి బయటికి వెళBigboss {#}Avunu;Pooja Hegde;House;Bigboss;Teluguహౌస్ లో ఉన్న రెండు వారాలకు.. పూజ మూర్తి ఎంత సంపాదించిందో తెలుసా?హౌస్ లో ఉన్న రెండు వారాలకు.. పూజ మూర్తి ఎంత సంపాదించిందో తెలుసా?Bigboss {#}Avunu;Pooja Hegde;House;Bigboss;TeluguMon, 23 Oct 2023 12:30:00 GMTప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా బిగ్ బాస్ ఏడవ సీజన్ అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే. మునుపటి సీజన్లతో పోల్చి చూస్తే కొత్త కొత్త టాస్కులు సరికొత్త ట్విస్టులతో ఈ షో రసవతంగా సాగుతూ ఉంది. అయితే బిగ్ బాస్ సెవెన్ సీసన్ లోకి అడుగుపెట్టిన లేడీ కంటెస్టెంట్స్ కి  ఏదైనా శాపం తగిలిందా అంటే మాత్రం.. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తే అందరూ అవును అని అంటున్నారు. ఎందుకంటే షో మొదలైన నాటి నుంచి కూడా ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్ జరిగాయి. అయితే ఈ ఏడు ఎలిమినేషన్స్ లో కూడా హౌస్ నుంచి బయటికి వెళ్లింది.. కేవలం లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే కావడం గమనార్హం.


 అయితే ఇటీవలే ఏడో వారంలో ఫిమేల్ కంటెస్టెంట్ కాకుండా మెయిల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నప్పటికీ.. మరోసారి ఫిమేల్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన సీరియల్ నటి పూజా మూర్తి.. ఇక రెండు వారాలపాటు హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయిపోయింది. ఆమెకు అతి తక్కువ ఓట్లు రావడంతో చివరికి ఆమె ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. అయితే రెండు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన పూజా మూర్తి.. ఎంత పారితోషకం తీసుకుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 సాధారణంగానే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ గా కొనసాగి ఆ తర్వాత ఎలిమినేట్ అయినవారు.. ఇక ఈ షో ద్వారా ఎంత సంపాదించారు అన్న విషయం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు పూజ హౌస్ నుంచి బయటికి రావడంతో ఆమె పారితోషికం ఎంత అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రెండు వారాలకు గాను పూజ మూర్తి కేవలం మూడు లక్షలు మాత్రమే తీసుకుందట. అంటే వారానికి ఆమె కేవలం 1.5 లక్షలు మాత్రమే పారితోషకం పొందిందట. ఇలా షోలో అతి తక్కువ రెమినరేషన్ తీసుకున్న కంటెస్టెంట్స్ గా పూజ మూర్తి నిలిచింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>