MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money0475b1b0-16f5-4238-81ca-f68f860ba8fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money0475b1b0-16f5-4238-81ca-f68f860ba8fb-415x250-IndiaHerald.jpgప్రస్తుత సమాజంలో మారుతున్న టెక్నాలజీకి, అత్యాధునిక ప్రపంచానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో .. చాలామంది పురుషులు , మహిళలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంపాదన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ.. వారికంటూ ఒక ఆర్థిక వనరును అందిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోని 2023 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీంను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇది చMONEY{#}Sukanya;central government;MinisterMoney: ఈ పథకాలు మహిళల కోసమే ప్రత్యేకం.. ఎలా అంటే..?Money: ఈ పథకాలు మహిళల కోసమే ప్రత్యేకం.. ఎలా అంటే..?MONEY{#}Sukanya;central government;MinisterMon, 23 Oct 2023 11:00:00 GMTప్రస్తుత సమాజంలో మారుతున్న టెక్నాలజీకి, అత్యాధునిక ప్రపంచానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో .. చాలామంది పురుషులు , మహిళలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంపాదన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ.. వారికంటూ ఒక ఆర్థిక వనరును అందిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోని 2023 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీంను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇది చిన్న పొదుపు పథకం ప్రత్యేకంగా మహిళల కోసమే రూపొందించడం జరిగింది.


మహిళల యొక్క ఆర్థిక సాధికారతే లక్ష్యంగా వచ్చిన ఈ పథకంలో మహిళలు కూడా ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉండడం గమనార్హం. ఇందులో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అధిక రాబడి కూడా వస్తుంది. ఈ పథకం తో పాటు సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా మహిళలకు మంచి ఆర్థిక భద్రతను కలిగిస్తోందని చెప్పవచ్చు.ఇకపోతే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంలో ఆడవారికి ఏవిధంగా ఉపయోగం ఉంది అనే విషయానికి వస్తే.. ఇందులో కనిష్టంగా 1000 రూపాయల నుంచి గరిష్టంగా రూ.2లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఈ పథకం యొక్క పెట్టుబడి కాలం రెండు సంవత్సరాలు మాత్రమే.. గరిష్టంగా 7.5% వడ్డీ లభిస్తోంది.ఇక మొదటి సంవత్సరం తర్వాత ఖాతాదారులు..  మీ మొత్తంలో 40 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఈ పథకం గురించి తెలుసుకొని చేరవచ్చు.

ఇక మరొకటి సుకన్య సమృద్ధి యోజన పథకంలో 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలు చేరవచ్చు.  డిపాజిట్ చేసిన మొత్తం పై 8% వడ్డీ లభిస్తుంది. కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ .1.5లక్షల వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. 18 ఏళ్లు వచ్చాక 50 శాతం డబ్బు ఉపసంహరించుకుంటే.. 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత పూర్తి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.  అంతే కాదు ఇందులో సెక్షన్ 80 సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>