Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icccf817b7a-c95e-4556-ac54-cd113b374a7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icccf817b7a-c95e-4556-ac54-cd113b374a7c-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దాయాదుల పోరు జరుగుతుంది అంటే చాలు ఇక క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని ఈ మ్యాచ్ చూడడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన కూడా అటు వ్యూయర్షిప్ రికార్డులు అన్నీ కూడా బద్దలవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే క్రికెట్ ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది. అయితే స్టేడియం కు వెళ్లి చూసేందుకు కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. దీIcc{#}Cricket;history;Pakistan;World Cup;VIRAT KOHLI;New Zealand;India;Audienceఓటిటి చరిత్రలో తొలిసారి.. వ్యూయర్షిప్ లో ఇండియా vs పాక్ మ్యాచ్ రికార్డు బద్దలు?ఓటిటి చరిత్రలో తొలిసారి.. వ్యూయర్షిప్ లో ఇండియా vs పాక్ మ్యాచ్ రికార్డు బద్దలు?Icc{#}Cricket;history;Pakistan;World Cup;VIRAT KOHLI;New Zealand;India;AudienceMon, 23 Oct 2023 08:50:00 GMTవరల్డ్ క్రికెట్లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దాయాదుల పోరు జరుగుతుంది అంటే చాలు ఇక క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని ఈ మ్యాచ్ చూడడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన కూడా అటు వ్యూయర్షిప్ రికార్డులు అన్నీ కూడా బద్దలవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే క్రికెట్ ప్రపంచం మొత్తం చూస్తూ ఉంటుంది. అయితే స్టేడియం కు వెళ్లి చూసేందుకు కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది.


 దీంతో చాలామంది ప్రేక్షకులు టీవీల ముందు కూర్చుని మ్యాచ్ వీక్షిస్తూ ఉంటే.. ఇంకొంతమంది ప్రేక్షకులు అటు ఓటిటి మాధ్యమాల ద్వారా మ్యాచ్ ను మిస్ అవ్వకుండా వీక్షిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వరల్డ్ కప్ మ్యాచ్లను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం  చేస్తుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి మొన్న రికార్డు స్థాయి  వ్యూయర్షిప్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇలా దాయాదుల పోరు జరగకపోయినప్పటికీ.. ఇలాంటి వ్యూయర్షిప్ రికార్డు మాత్రం బద్దలు అయింది. డిజిటల్ స్ట్రీమింగ్ చరిత్రలోనే తొలిసారి ఈ రేంజ్ లో వ్యూయర్షిప్ నమోదు కావడం గమనార్హం.


 ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో హాట్స్టార్ చరిత్ర సృష్టించింది  డిజిటల్ స్ట్రీమింగ్ హిస్టరీలో తొలిసారిగా 4.3 కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు  విరాట్ కోహ్లీ బ్యాటింగ్, భారత్కు విజయం సమీపిస్తున్న సమయంలో ఇది చోటుచేసుకుంది. ఇప్పటివరకు హాట్ స్టార్లో అత్యధిక వీక్షకులు సంఖ్య 3.80 కోట్లే. ఇది కూడా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో నమోదయింది. కానీ ఇటీవలదాయాదుల పోరు సృష్టించిన రికార్డును సైతం.. న్యూజిలాండ్, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ తుడిచిపెట్టింది అని చెప్పాలి. దీంతో అందరూ ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>