Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-3ebe3a39-980e-4954-a23c-f70e56d5977a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-3ebe3a39-980e-4954-a23c-f70e56d5977a-415x250-IndiaHerald.jpgవిరాట్ కోహ్లీ ఎవరు అంటే.. టీమిండియా స్టార్ ప్లేయర్ అని చెప్పేవాళ్లు చాలా తక్కువ ఉంటారు. విరాట్ కోహ్లీ ఎవరు అంటే.. అతను సెంచరీల వీరుడు అంటారు కొందరు. విరాట్ కోహ్లీ ఎవరు అంటే.. అతను ఒక పరుగుల యంత్రం అని అంటారు మరికొందరు.. విరాట్ కోహ్లీ ఎవరు అంటే.. ప్రత్యర్ధులకు ముచ్చమటలు పట్టించే ధీరుడు అంటారు కొంతమంది అభిమానులు. ఇలా ఎంతో మంది ఫ్యాన్స్ ఎవరికి వారు విరాట్ కోహ్లీకి సరికొత్త నిర్వచనాలు చెబుతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా విరాట్ కోహ్లీ గురించి చెబుతున్నారు అంటే అతను అంతర్జాతీయ క్రిKohli {#}Sachin Tendulkar;World Cup;VIRAT KOHLI;INTERNATIONAL;Yevaruసచిన్ రికార్డ్ సేఫ్.. కోహ్లీ జస్ట్ మిస్?సచిన్ రికార్డ్ సేఫ్.. కోహ్లీ జస్ట్ మిస్?Kohli {#}Sachin Tendulkar;World Cup;VIRAT KOHLI;INTERNATIONAL;YevaruMon, 23 Oct 2023 09:00:00 GMTవిరాట్ కోహ్లీ ఎవరు అంటే.. టీమిండియా స్టార్ ప్లేయర్ అని చెప్పేవాళ్లు చాలా తక్కువ ఉంటారు. విరాట్ కోహ్లీ ఎవరు అంటే.. అతను సెంచరీల వీరుడు అంటారు కొందరు. విరాట్ కోహ్లీ ఎవరు అంటే.. అతను ఒక పరుగుల యంత్రం అని అంటారు మరికొందరు.. విరాట్ కోహ్లీ ఎవరు అంటే.. ప్రత్యర్ధులకు ముచ్చమటలు పట్టించే ధీరుడు అంటారు కొంతమంది అభిమానులు. ఇలా ఎంతో మంది ఫ్యాన్స్ ఎవరికి వారు విరాట్ కోహ్లీకి సరికొత్త నిర్వచనాలు చెబుతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా విరాట్ కోహ్లీ గురించి చెబుతున్నారు అంటే అతను అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఎంత సాధించి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఎలా అయితే తర్వాత జనరేషన్ కి రోల్ మోడల్ లాగా నిలిచాడో.. ఇక ఇక ఇప్పుడు తర్వాత జనరేషన్ కి విరాట్ కోహ్లీ కూడా అలాగే రోల్ మోడల్ గా నిలుస్తాడు అని చెప్పాలి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులకు నేటితరంలో స్టార్ ప్లేయర్లుగా ఉన్నవారు ఎవరు కూడా కనీసం దరిదాపుల్లో కూడా లేరు. అయితే ప్రపంచ క్రికెట్లో ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన సచిన్ రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా కోహ్లీ తన ఆట తీరును కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఇలాంటి ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు కోహ్లీ.


 టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం కొనసాగించాడు. ఆచితూచి ఆడుతూ టీమ్ ఇండియాను విజయ తీరాల వైపుకు నడిపించాడు. ఈ క్రమంలోనే 95 పరుగుల వద్ద ఉన్న విరాట్ కోహ్లీ ఎంతో అలవోకగా సెంచరీ సాధిస్తాడని వన్డే ఫార్మాట్లో సచిన్ సాధించిన 49 సెంచరీల రికార్డును బద్దలు కొడతాడు అందరూ అనుకున్నారు. కానీ చివర్లో సిక్స్ కొట్టే క్రమంలో చివరికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ. దీంతో ఇప్పటివరకు వన్డే ఫార్మట్ లో 48 సెంచరీలు చేసిన కోహ్లీ, సచిన్ 49 సెంచరీల రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>