MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthi-089203c2-b904-4881-8ab1-6834d15931bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthi-089203c2-b904-4881-8ab1-6834d15931bd-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో కార్తీ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన తన కెరియర్ బిగినింగ్ నుండే తాను నటించిన దాదాపు ప్రతి సినిమాను కూడా తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. ఇక అందులో భాగంగా ఈ నటుడు నటించిన అనేక సినిమాలు కూడా తెలుగు లో మంచి విజయాలు సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ నటుడు సర్దార్ అనే "Karthi {#}annapurna;Japan;king;Telugu;Tollywood;Kollywood;Diwali;Hero;Heroine;Cinemaఅఫిషియల్ : "జపాన్" తెలుగు వర్షన్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!అఫిషియల్ : "జపాన్" తెలుగు వర్షన్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!Karthi {#}annapurna;Japan;king;Telugu;Tollywood;Kollywood;Diwali;Hero;Heroine;CinemaSun, 22 Oct 2023 10:30:00 GMTతమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో కార్తీ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన తన కెరియర్ బిగినింగ్ నుండే తాను నటించిన దాదాపు ప్రతి సినిమాను కూడా తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. ఇక అందులో భాగంగా ఈ నటుడు నటించిన అనేక సినిమాలు కూడా తెలుగు లో మంచి విజయాలు సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ నటుడు సర్దార్ అనే "స్పై" యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తమిళ , తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో కూడా మంచి విజయాన్ని అందుకొని కార్తీ కి మంచి విజయాన్ని అందించింది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు జపాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ యూనిట్ కొంతకాలం క్రితమే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ వారు దక్కించుకున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. అన్నపూర్ణ స్టూడియో సంస్థ వారు ఈ సినిమా తెలుగు వర్షన్ ను భారీ ఎత్తున విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>