EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr8b7dbbea-007d-4a2a-9473-92ae1538e023-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcr8b7dbbea-007d-4a2a-9473-92ae1538e023-415x250-IndiaHerald.jpgరాజకీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని మరచిపోకూడదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ మరణించినప్పుడు చాలా మంది పార్టీ కార్యకర్తలు చనిపోయారు. వారంతా వైఎస్ మరణ వార్త విని హఠన్మారణం చెందకపోయినా.. ఆ రెండు రోజుల్లో మరణించిన వారందరనీ వైఎస్ మృతి కారణంగానే చనిపోయిన వారిగా చూపించారు. దీంతో జగన్ ఓదార్పు యాత్ర పేరుతో వారందరినీ కలసి ఆర్థిక సాయం చేశారు. తమ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది కాబట్టి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనకు సహకరించారు. దీనిని ఆపాలని కాంగ్రెస్ అధిష్ఠానం సూచkcr{#}CBN;vishwa;Jagan;Government;Telangana Chief Minister;TDP;local language;Yatra;Nara Bhuvaneshwari;Nijam;Party;KCR;Congress;Telanganaకేసీఆర్.. ఆ విషయంలో ఏపీని చూసి నేర్చుకోవాలా?కేసీఆర్.. ఆ విషయంలో ఏపీని చూసి నేర్చుకోవాలా?kcr{#}CBN;vishwa;Jagan;Government;Telangana Chief Minister;TDP;local language;Yatra;Nara Bhuvaneshwari;Nijam;Party;KCR;Congress;TelanganaSun, 22 Oct 2023 10:00:00 GMTరాజకీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని మరచిపోకూడదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ మరణించినప్పుడు చాలా మంది పార్టీ కార్యకర్తలు చనిపోయారు. వారంతా వైఎస్ మరణ వార్త విని హఠన్మారణం చెందకపోయినా.. ఆ రెండు రోజుల్లో మరణించిన వారందరనీ వైఎస్ మృతి కారణంగానే చనిపోయిన వారిగా చూపించారు.


దీంతో జగన్ ఓదార్పు యాత్ర పేరుతో వారందరినీ కలసి ఆర్థిక సాయం చేశారు. తమ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది కాబట్టి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనకు సహకరించారు. దీనిని ఆపాలని కాంగ్రెస్ అధిష్ఠానం సూచించినా లెక్క చేయకుండా ఓదార్పు యాత్రను చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. దీనివల్ల జగన్ కు ఏపీలో సానుకూల వాతావరణం ఏర్పడింది.


ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై నెల రోజులు దాటింది. బెయిల్ కోసం.. కేసు కొట్టేయాలని ఆయన తరఫు లాయర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు సమయంలో కొంతమంతి టీడీపీ కార్యకర్తలు మరణించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు నిజం గెలవాలి అనే కార్యక్రమంతో నారా భువనేశ్వరి ముందుకు వెళ్తున్నారు.  


ఈ రెండు అంశాలను చూసైనా కేసీఆర్ తన వైఖరిలో మార్పు తెచ్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. సుమారు 1200మంది యువకుల ఆత్మ బలిదానాల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మనందరికీ తెలిసిందే. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించాక తొమ్మిదిన్నరేళ్లలో వారిని కలిసే ప్రయత్నం కానీ పరామర్శించడం కానీ చేయలేదు. ఏపీలో మాదిరిగా ఇక్కడ కూడా చేసుంటే ఆయనకు ప్రజల్లో తగిన గౌరవం ఉండేది. గతంలో అమరుల కుటుంబాలు ఉద్యోగాలు, ఆర్థిక సాయాలు, ఇంటి స్థలాలు లాంటి అనేక హామీలిచ్చి విస్మరించారు. కనీసం ఇప్పుడు అయినా తెలంగాణలో ఏ ప్రభుత్వం  ఏర్పడినా ఏపీని స్ఫూర్తిగా తీసుకొని వీరిని పరామర్శిస్తే బావుంటుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>