Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlic1374725-1844-4b8a-8828-801f4fda88bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlic1374725-1844-4b8a-8828-801f4fda88bf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం 2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీం ఇండియా. సాధారణంగానే వరల్డ్ కప్ లో టీమిండియా ఎప్పుడు టైటిల్ ఫేవరెట్ అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో ఇక టీమిండియా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వరల్డ్ కప్ గెలిచి తీరుతుందని భారత అభిమానులు కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా కూడా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. ప్రత్యర్థి ఎవKohli{#}surya sivakumar;Hardik Pandya;Ishan Kishan;New Zealand;World Cup;News;Indiaబాబోయ్.. టీమిండియాకు ఇలాంటి పరిస్థితి ఎదురైందేంటి?బాబోయ్.. టీమిండియాకు ఇలాంటి పరిస్థితి ఎదురైందేంటి?Kohli{#}surya sivakumar;Hardik Pandya;Ishan Kishan;New Zealand;World Cup;News;IndiaSun, 22 Oct 2023 11:00:00 GMTప్రస్తుతం 2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీం ఇండియా. సాధారణంగానే వరల్డ్ కప్ లో టీమిండియా ఎప్పుడు టైటిల్ ఫేవరెట్ అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో ఇక టీమిండియా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వరల్డ్ కప్ గెలిచి తీరుతుందని భారత అభిమానులు కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా కూడా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్కచేయకుండా చిత్తుగా ఓడిస్తూ పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అలాంటి భారత జట్టు పటిష్టమైన న్యూజిలాండ్ తో నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతుండగా   గాయాలు బెడద  మాత్రం తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ సమయంలో హార్దిక్ పాండ్యా గాయం బారిన పడ్డాడు. అయితే అతని స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారు అని చర్చ మొదలవగా.. సూర్య కుమార్ అయితే బాగుంటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.


 కానీ ఇప్పుడు టీమ్ ఇండియాకు మాత్రం ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ సైతం.. గాయం బారిన పడ్డాడు. దీంతో న్యూజిలాండ్తో మ్యాచ్లో అతను జట్టుకు దూరంగానే ఉండబోతున్నాడు. ఇక మరో ఆప్షన్ గా ఉన్న ఇషాన్ కిషన్ సైతం తేనెటీగలు కుట్టడంతో అతను కూడా న్యూజిలాండ్తో మ్యాచ్లో బరిలోకి దిగే అవకాశం లేదు అన్నది తెలుస్తుంది. మరోవైపు జడేజాకు కూడా గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో జట్టులోకి ఎంత మంది కొత్త ఆటగాళ్లు వస్తారు అనే విషయంపై కూడా కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>