MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vatika-saree-varun-sandeshe050b0b3-22b6-4f3b-b39f-a457f0d24694-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vatika-saree-varun-sandeshe050b0b3-22b6-4f3b-b39f-a457f0d24694-415x250-IndiaHerald.jpgప్రముఖ హీరో వరుణ్ సందేశ్ భార్యగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వితికా షేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె పలు సినిమాలలో నటించి మెప్పించింది. తర్వాత సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. ఇక వరుణ్ సందేశ్ ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన వితిక తన భర్తతో కలిసి బిగ్ బాస్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. అక్కడ తన గేమ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా బాధపడిందని , తనVATIKA SAREE ;VARUN SANDESH{#}varun sandesh;vithika sheru;GEUM;you tube;Success;Bigboss;House;Hero;Heroine;mediaఅటువంటి వ్యాధులతో బాధపడుతున్నా - వితికా షేరు..!అటువంటి వ్యాధులతో బాధపడుతున్నా - వితికా షేరు..!VATIKA SAREE ;VARUN SANDESH{#}varun sandesh;vithika sheru;GEUM;you tube;Success;Bigboss;House;Hero;Heroine;mediaSun, 22 Oct 2023 12:00:00 GMTప్రముఖ హీరో వరుణ్ సందేశ్ భార్యగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వితికా షేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె పలు సినిమాలలో నటించి మెప్పించింది. తర్వాత సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. ఇక వరుణ్ సందేశ్ ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన వితిక తన భర్తతో కలిసి బిగ్ బాస్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.

అక్కడ తన గేమ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా బాధపడిందని , తనకు కొంతమంది పిచ్చి పిచ్చి మెసేజ్లు చేసి చిరాకు తెప్పించారని వెల్లడించిన విషయం తెలిసిందే. మరొకవైపు వితిక ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తాను ఒక వ్యాధితో బాధపడుతున్నాను అంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది. తాను స్పాండిలైటిస్, మైగ్రేన్ వంటి వ్యాధులతో బాధపడుతున్నానని..  తలపోటు, మెడ నొప్పి వల్ల ఏ పని చేయలేకపోతున్నానని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది.

స్పాండిలైటిస్ కోసం చికిత్స చేయించుకుంటున్నాను అని తెలిపిన ఈమె ఇందుకోసం ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు నొప్పి తీవ్రంగా ఉన్న ప్రదేశంలో సూదులతో గుచ్చే ప్రక్రియ కూడా చేయించుకుంటున్నట్లు తెలిపింది ఈ ముద్దుగుమ్మ.  ఇక వితిక ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నానని చెప్పడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ వ్యాధుల నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వితికా షేర్ ఒకానొక సమయంలో సినిమాలతో భారీ పేరు దక్కించుకుంది కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేక పోయింది . అందుకే ఇప్పుడు ఇలా యూట్యూబ్ ఛానల్ నడుపుతూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ అలాగే పలు షో లకి కూడా హాజరవుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>