Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea7b2f3b2-78ac-48a1-a5c1-2176d813081e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea7b2f3b2-78ac-48a1-a5c1-2176d813081e-415x250-IndiaHerald.jpgప్రజా సమస్యలపై సినిమాలు తీసే ఆర్‌.నారాయణమూర్తి ‘టెంపర్' సినిమా చేయాల్సి ఉందట. కానీ ఆయన ఆ సినిమా ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట.పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా మిగిలిపోయింది. ఈ సినిమా వరకు ప్లాప్ ల్లో ఉన్న ఎన్టీఆర్.. టెంపర్ సక్సెస్ తో మళ్ళీ ఇప్పటి వరకు ప్లాప్ చూడలేదు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో ముఖ్య పాత్ర కూడా ఉంటుంది.socialstars lifestyle{#}Jr NTR;Temper;Pulaparthi Narayanamurthy;Hero;NTR;Box office;Cinema'టెంపర్' మూవీలో వచ్చిన ఛాన్స్ ను వద్దనుకున్నా సీనియర్ నటుడు.....!!'టెంపర్' మూవీలో వచ్చిన ఛాన్స్ ను వద్దనుకున్నా సీనియర్ నటుడు.....!!socialstars lifestyle{#}Jr NTR;Temper;Pulaparthi Narayanamurthy;Hero;NTR;Box office;CinemaSun, 22 Oct 2023 09:20:00 GMTప్రజా సమస్యలపై సినిమాలు తీసే ఆర్‌.నారాయణమూర్తి ‘టెంపర్' సినిమా చేయాల్సి ఉందట. కానీ ఆయన ఆ సినిమా ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట.పూరి జగన్నాథ్‌ దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ హీరో గా తెరకెక్కిన టెంపర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా మిగిలిపోయింది. ఈ సినిమా వరకు ప్లాప్ ల్లో ఉన్న ఎన్టీఆర్.. టెంపర్ సక్సెస్ తో మళ్ళీ ఇప్పటి వరకు ప్లాప్ చూడలేదు.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో ముఖ్య పాత్ర కూడా ఉంటుంది. అదే ‘పోసాని కృష్ణమురళి’ పోషించిన ‘కానిస్టేబుల్ మూర్తి’ పాత్ర. సినిమాలో ఈ పాత్రకి ఎంతటి గుర్తింపు వచ్చిందో చెప్పనవసరం లేదు. కథని మలుపు తిప్పేదే ఈ పాత్ర. అలాంటి ఈ రోల్ కి పూరీజగన్నాధ్ ముందుగా ఆర్‌.నారాయణమూర్తి అనుకున్నాడట. అంతేకాదు ఆయనను కలిసి కథ కూడా వినిపించాడట. అయితే నారాయణమూర్తి మాత్రం సున్నితంగా తిరస్కరించారట. ఎన్టీఆర్ కూడా ఈ పాత్ర చేయమని నారాయణమూర్తిని చాలా ప్రేమగా అడిగాడట. అయినా సరే ఆయన ఒప్పుకోలేదు.

అందుకు గల కారణం కూడా ఆయన ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. “పూరిజగన్నాథ్ నాకు ఒక గొప్ప పాత్రని నాకు ఇద్దామనుకున్నాడు. కానీ దానిని కాదు అనుకున్నాను. దానికి కారణం.. నేను జూనియర్‌ ఆర్టిస్ట్‌ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి హీరో స్థాయికి ఎదిగాను. నేను ఇంకా నటిస్తే ఒక ఐదారేళ్ళు చేస్తానేమో. అయితే నటించిన ఈ కొన్నాళ్ళు మెయిన్ లీడ్ గానే నటించాలి. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మళ్ళీ చేయకూడదని అనుకున్నా. అందుకే ఆ ఆఫర్ కాదన్నాను తప్ప ఇంకే ఉద్దేశం లేదు” అంటూ చెప్పారు నారాయణమూర్తి. దీంతో ఆ పాత్ర పోసానికి వచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>