Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc69eb91c2-07fc-49d8-9f45-c100a67c9ef2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc69eb91c2-07fc-49d8-9f45-c100a67c9ef2-415x250-IndiaHerald.jpgప్రపంచ కప్ టోర్నీలో అన్ని మ్యాచ్లు కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి. అయితే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం విశ్లేషకులు సైతం ముందుగా ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఫలితం విషయంలో అందరి అంచనాలు కూడా తారుమారు అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే నేడు ప్రపంచ కప్ టోర్నీలో మరో రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ వరల్డ్ కప్ లో ఇప్పుడు వరకు ఓటమి ఎరుగని జట్లుగా దూసుకుపోతున్న న్యూజిలాండ్, భారత్ మధ్య నేడు మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలిచి పైచేయి సాధిస్తారు అన్Icc{#}England;New Zealand;World Cup;Good news;Good Newwz;Yevaru;Indiaభారత్ తో మ్యాచ్ కి ముందు.. కివిస్ కు బిగ్ గుడ్ న్యూస్?భారత్ తో మ్యాచ్ కి ముందు.. కివిస్ కు బిగ్ గుడ్ న్యూస్?Icc{#}England;New Zealand;World Cup;Good news;Good Newwz;Yevaru;IndiaSun, 22 Oct 2023 10:45:00 GMTప్రపంచ కప్ టోర్నీలో అన్ని మ్యాచ్లు కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి. అయితే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం విశ్లేషకులు సైతం ముందుగా ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఫలితం విషయంలో అందరి అంచనాలు కూడా తారుమారు అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే నేడు ప్రపంచ కప్ టోర్నీలో మరో రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ వరల్డ్ కప్ లో ఇప్పుడు వరకు ఓటమి ఎరుగని జట్లుగా దూసుకుపోతున్న న్యూజిలాండ్, భారత్ మధ్య నేడు మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలిచి పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఈ మ్యాచ్ ఫలితం వచ్చిన తర్వాత రెండు జట్లలో ఏదో ఒక టీం కి విజయాల పరంపరకు బ్రేక్ పడే అవకాశం ఉంది. అయితే అటు న్యూజిలాండ్ తో మ్యాచ్ కు ముందు జట్టులో కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఉండడంతో అటు భారత జట్టుకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు న్యూజిలాండ్ కి మాత్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. పటిష్టమైన భారత్తో మ్యాచ్ జరగడానికి ముందు ఒక కీలక ఆటగాడు న్యూజిలాండ్ జట్టులో చేరబోతున్నాడట. ఆ ఆటగాడి రాకతో కివీస్ జట్టు మరింత పటిష్టంగా మారుతుంది అని చెప్పాలి.


 ఇలా భారత్ తో మ్యాచ్కి ముందు కివిస్ జట్టులో చేరబోయే స్టార్ ప్లేయర్ ఎవరో కాదు టీమ్ సౌథి.  అతను జట్టులో చేరాడు అంటే న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారిపోతుంది. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి జట్టుకు అందుబాటులోకి వచ్చాడట. ఈ ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో సౌథి చేతి వేలికి గాయమైంది. దీంతో వరల్డ్ కప్ కోసం సౌథి భారత్ చేరుకున్నప్పటికీ ఇక మ్యాచులు మాత్రం ఆడటంలేదు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి ఫిట్నెస్  సాధించడంతో ఇక భారత్తో మ్యాచ్లో బరిలోకి దిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>