HealthChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/cancer3030dbf2-432d-473b-95df-143c5a3e6342-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/cancer3030dbf2-432d-473b-95df-143c5a3e6342-415x250-IndiaHerald.jpgక్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో మనందరకీ తెలిసిందే. ఇందులో స్త్రీలకు వచ్చే రొమ్ము క్యాన్సర్ విషయంలో కొంత అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం. చంకల్లో, రొమ్ముల్లో, దగ్గర కొన్ని మార్పులు గమనిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. అయితే క్యాన్సర్ విషయాల్లో అందరికీ పలు సందేహాలు వస్తూనే ఉంటాయి. వాటిని వెంటనే నివృత్తి చేసుకుంటే మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ వ్యాధి వచ్చిన వారు జీవితకాలం మందులు వాడాలా.. తగ్గిన తర్వాత మళ్లీ వచ్చే అవకాశం ఉందా అనే అనుమాcancer{#}Mano;Survey;Cancer;Manamబ్రెస్ట్ క్యాన్సర్ వస్తే.. ఎన్నాళ్లు మందులు వాడాలి?బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే.. ఎన్నాళ్లు మందులు వాడాలి?cancer{#}Mano;Survey;Cancer;ManamSun, 22 Oct 2023 09:00:00 GMTక్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో మనందరకీ తెలిసిందే. ఇందులో స్త్రీలకు వచ్చే రొమ్ము క్యాన్సర్ విషయంలో కొంత అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం. చంకల్లో, రొమ్ముల్లో, దగ్గర కొన్ని మార్పులు గమనిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.  అయితే క్యాన్సర్ విషయాల్లో అందరికీ పలు సందేహాలు వస్తూనే ఉంటాయి. వాటిని వెంటనే నివృత్తి చేసుకుంటే మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ వ్యాధి వచ్చిన వారు జీవితకాలం మందులు వాడాలా.. తగ్గిన తర్వాత మళ్లీ వచ్చే అవకాశం ఉందా అనే అనుమానాలు వస్తుంటాయి. దీనిపై ఆరోగ్య నిపుణులు పలు సలహాలు తెలియజేశారు. రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. హార్మోన్ రిసాప్టర్ పాజిటివ్ క్యాన్సర్ అయితే ఒక ట్యాబ్లెట్ ను 5 నుంచి 10 సంవత్సరాలు ఉపయోగించాల్సి ఉంటుంది. దీనిని జీవితకాలం ఉపయోగించాల్సిన అవసరం లేదు.


రొమ్ము క్యాన్సర్ కు శస్త్ర చికిత్స చేసిన తర్వాత అవసరం అయితే కీమో థెరపీ చేస్తారు. ఇది సుమారు ఆరు నెలల పాటు కొనసాగుతుంది. తర్వాత రేడియోథెరపీ ఇవ్వాల్సి వస్తే కొన్ని వారాలు చేస్తారు.  కొంతమందికి హార్మోన్ రిసాప్టర్ పాజిటివ్ ఉంటే టాబ్లెట్ ఇస్తారు. అంతేకానీ దీనికి జీవతకాల చికిత్స ఉండదు.


కాకపోతే చికిత్స అయిపోయిన అనంతరం ఒక రొమ్ము నుంచి మరొక రొమ్ముకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏడాదికి ఒకసారి సర్వే లైన్స్ మామోగ్రామ్ మరియు అల్ర్టా సౌండ్ స్కాన్ చేయించుకోవాలి. మూడు నాలుగు నెలలకోసారి వైద్యులను సంప్రదించాలి. అంతేకానీ ప్రతి మూడు నెలలకు ఓసారి మామోగ్రామ్, రక్త పరీక్షలు మరే ఇతర పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. చికిత్స నిమిత్తం వచ్చిన వారికి మనో ధైర్యం కల్పించాలి.  అంతేకానీ తరచూ పరీక్షలు కానీ జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>