PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pakistanccff5f53-941e-4d0c-a35e-f92bf7def966-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pakistanccff5f53-941e-4d0c-a35e-f92bf7def966-415x250-IndiaHerald.jpgమన నుంచి విడిపోయినా పాకిస్థాన్ మనపై ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉంటుంది. అది అంతర్జాతీయ వేదికలపై కావొచ్చు, మన అంతరంగిక వ్యవహారాల్లో కావొచ్చు చివరకు క్రికెట్, హాకీల్లో కూడా తమ విద్వేషాన్ని చూపుతూనే ఉంటారు. క్రికెట్ లో భారత్ ను ఓడిస్తే హీరోయిన్లు డేట్ కు వస్తానని బహిరంగ ప్రకటనలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. మనం కూడా వారికి అదే రీతిలో వారికి బదులిస్తాం. పాకిస్థాన్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.350, కేజీ బియ్యం రూ.100 నిత్యావసర సరకుల ధరలన్నీ ఆకాశన్నంటుతున్నాయి. pakistan{#}Cricket;India;Pakistan;advertisement;Petrol;oil;INTERNATIONAL;indigo airlines;Manamవిమానాలు నడపలేకపోతున్న పాకిస్తాన్‌?విమానాలు నడపలేకపోతున్న పాకిస్తాన్‌?pakistan{#}Cricket;India;Pakistan;advertisement;Petrol;oil;INTERNATIONAL;indigo airlines;ManamSun, 22 Oct 2023 08:24:00 GMTమన నుంచి విడిపోయినా పాకిస్థాన్ మనపై ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉంటుంది. అది అంతర్జాతీయ వేదికలపై కావొచ్చు, మన అంతరంగిక వ్యవహారాల్లో కావొచ్చు చివరకు క్రికెట్, హాకీల్లో కూడా తమ విద్వేషాన్ని చూపుతూనే ఉంటారు. క్రికెట్ లో భారత్ ను ఓడిస్తే హీరోయిన్లు డేట్ కు వస్తానని బహిరంగ ప్రకటనలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. మనం కూడా వారికి అదే రీతిలో వారికి బదులిస్తాం.


పాకిస్థాన్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.350, కేజీ బియ్యం రూ.100 నిత్యావసర సరకుల ధరలన్నీ ఆకాశన్నంటుతున్నాయి.  అక్కడ ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు కూడా తరిగిపోయాయి. అక్కడి పౌరులు జీవించడమే గగనమయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి. చిన్న చిన్న వస్తువలు దగ్గర నుంచి ఇంధనాల వరకు అన్నీ ధరలు ప్రియమయ్యాయి.


తాజాగా పాకిస్థాన్ లో ఆయిల్, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో అక్కడి ఇంటర్నేషనల్ విమాన సంస్థ తమ ఫ్లైట్లను రద్దు చేసింది. విమానాలు నడపాలంటే ఇంధనం అవసరం కదా. మరి ఆ చమురే ఇప్పుడు అక్కడ బంగారమైంది. దీంతో పాక్ ఎయిర్ లైన్స్ అన్ని విమానాలను పక్కన పెట్టేసింది. సరిపడనంత ఇంధన సరఫరా లేకపోవడంతో విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ ప్రతినిధులు తెలిపారు. 13 డొమెస్టిక్, 11 ఇంటర్  నేషనల్  ఫ్లైట్లు రద్దు చేశారు. మిగతా వాటిని రీ షెడ్యూల్ చేశారు.


పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ కు అక్కడి ప్రభుత్వమే ఇంధన సరఫరా చేస్తోంది. అయితే ఎయిర్ లైన్స్ నష్టాల్లో ఉండటంతో దీనికి చాలా రోజుల నుంచి డబ్బులు కట్టడం లేదు. దీంతో పాక్ స్టేట్ ఆయిల్ సరఫరాను నిలిపివేసింది. అప్పుల ఊబిలో ఉన్న ఎయిర్ లైన్స్ ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ సాయం కూడా అందడం లేదు. ఆ సంస్థ నష్టాల నుంచి బయట పడాలంటే కనీసం 100 మిలియన్లు అవసరం. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఎయిర్ లైన్స్ తల  పట్టుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>