Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni056a6a1c-1614-48b2-80d5-308898a8362d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni056a6a1c-1614-48b2-80d5-308898a8362d-415x250-IndiaHerald.jpgభారత జట్టుకు రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోనీకి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందు చివరి రోజుల్లో సరైన వీడ్కోలు దక్కలేదు అనుకున్న క్షణం భారత క్రికెట్ ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. ఆ క్షణం ఏదో కాదు 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ అని చెప్పాలి. వర్షం కారణంగా రెండు రోజులపాటు సాగిన మ్యాచ్లో చివరికి ధోని ఔట్ అయిన క్షణం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరిలో కూడా ఆశలు గల్లంతయ్యేలా చేసింది. లీక్ మ్యాచ్లలో అద్భుతంగా రానించిన టీమింDhoni{#}Kshanam;Rishabh Pant;Hanu Raghavapudi;Varsham;MS Dhoni;Cricket;Heart;Hardik Pandya;New Zealand;World Cup;Indiaఆ మ్యాచ్ ఓడిపోయాక.. ధోని వెక్కి వెక్కి ఏడ్చాడు : మాజీ కోచ్ఆ మ్యాచ్ ఓడిపోయాక.. ధోని వెక్కి వెక్కి ఏడ్చాడు : మాజీ కోచ్Dhoni{#}Kshanam;Rishabh Pant;Hanu Raghavapudi;Varsham;MS Dhoni;Cricket;Heart;Hardik Pandya;New Zealand;World Cup;IndiaSun, 22 Oct 2023 18:30:00 GMTభారత జట్టుకు రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోనీకి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందు చివరి రోజుల్లో సరైన వీడ్కోలు దక్కలేదు అనుకున్న క్షణం భారత క్రికెట్ ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. ఆ క్షణం ఏదో కాదు 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ అని చెప్పాలి. వర్షం కారణంగా రెండు రోజులపాటు సాగిన మ్యాచ్లో చివరికి ధోని ఔట్ అయిన క్షణం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరిలో కూడా ఆశలు గల్లంతయ్యేలా చేసింది.


 లీక్ మ్యాచ్లలో అద్భుతంగా రానించిన టీమిండియా.. సెమీఫైనల్ మ్యాచ్లలో మాత్రం దారుణంగా విఫలమైంది  ఈ క్రమంలోనే న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని చేదించలేకపోయింది. చివరికి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది టీమ్ ఇండియా. అది భారత అభిమానులు అందరికీ కూడా హార్ట్ బ్రేక్ మూమెంట్ అని చెప్పాలి. ధోనీకి సరైన వీడ్కోలు ఇవ్వలేకపోయామే అని భారత జట్టులోని ఆటగాళ్లు అందరూ కూడా ఎంతగానో ఫీల్ అయ్యారు  అయితే ఆ సమయంలో ప్రశాంతంగా ఒత్తిడిని తట్టుకునే మహేంద్రసింగ్ ధోనితో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాట్స్మెన్ రిషబ్ పంతు కూడా డ్రెస్సింగ్ రూమ్ లో చిన్నపిల్లాడి లాగా ఏడ్చారు అంటూ అప్పటి టీమ్ ఇండియా కోచ్ చెప్పుకొచ్చారు.


 వీళ్లు మాత్రమే కాదు చాలామంది ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ లోకి కన్నీళ్లు పెట్టుకున్నారు. ధోని దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ ఉంటే.. హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ అతని పట్టుకుని ఏడిచారు. ఆరోజు డ్రెస్సింగ్ రూమ్ అంతా నిశ్శబ్దమే. ఆ మూడ్ నుంచి బయటపడటానికి భారత ఆటగాళ్ళకు చాలా రోజులే సమయం పట్టింది. ధోనీకి సరైన వీడ్కోలు ఇవ్వలేకపోయామనే బాధ చాలామంది ప్లేయర్ల మదిలో నిండిపోయింది అంటూ టీమ్ ఇండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఇటీవల చెప్పుకొచ్చాడు. అయితే ఆ రోజు రన్ అవుట్ అయిన సమయంలో కూడా ధోని డగౌట్ కు వెళ్తున్న సమయంలో ఎంతో ఎమోషనల్ అవుతూ వెళ్ళిన వీడియోని భారత క్రికెట్ ప్రేక్షకులు ఇప్పటికి మరిచిపోలేరు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>