HealthChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health8431cd98-3d57-43fa-a772-f464cf758e3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health8431cd98-3d57-43fa-a772-f464cf758e3d-415x250-IndiaHerald.jpgఇప్పటిదాకా కుటుంబ నియంత్రణకు కండోమ్.. లేకుంటే వేసేక్టమీ.. పద్ధతులను పురుషులు ఉపయోగించేవారు. ఇకపై వీటి అవసరం ఉండకపోవచ్చు. తొడుగులు తొడగకుండా.. కోతలు కోయకుండా ఒక్క ఇంజక్షన్ సాయంతో కుటుంబ నియంత్రణ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనివల్ల సమయం, వ్యక్తుల ఆరోగ్యం బాగుంటుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో సరికొత్త ఒరవడి సృష్టించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ పురుషుల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసిన ఇంజక్షన్ కు నిర్వహించినhealth{#}Indian;Shaktiఆ ఒక్క ఇంజక్షన్‌ చేస్తే.. ఇక పిల్లలు పుట్టరు?ఆ ఒక్క ఇంజక్షన్‌ చేస్తే.. ఇక పిల్లలు పుట్టరు?health{#}Indian;ShaktiSun, 22 Oct 2023 11:00:00 GMTఇప్పటిదాకా కుటుంబ నియంత్రణకు కండోమ్.. లేకుంటే వేసేక్టమీ.. పద్ధతులను పురుషులు ఉపయోగించేవారు. ఇకపై వీటి అవసరం ఉండకపోవచ్చు. తొడుగులు తొడగకుండా.. కోతలు కోయకుండా ఒక్క ఇంజక్షన్ సాయంతో కుటుంబ నియంత్రణ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనివల్ల సమయం, వ్యక్తుల ఆరోగ్యం బాగుంటుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో సరికొత్త ఒరవడి సృష్టించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ పురుషుల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసిన ఇంజక్షన్ కు నిర్వహించిన ట్రయిల్స్ విజయవంతమయ్యాయి.  కుటుంబ నియంత్రణలో భాగంగా పురుషులు వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు. లేదంటే కండోమ్ వాడుతుంటారు. అయితే వీటితో పని లేకుండా ఐసీఎంఆర్ రివర్స్బుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్(ఆర్ ఐఎస్ యూజీ) అనే పురుష గర్భ నిరోధక ఇంజక్షన్ తీసుకువచ్చారు. దీనికి మూడు దశల క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించారు. ఇవి విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఎలాంటి దుష్ర్భవాలు తలెత్తలేదని ఇది సురక్షితమైందని అత్యంత ప్రభావితమైనదని ఐసీఎంఆర్ తెలిపింది.


25-40 ఏళ్ల మధ్య వయసున్న 303 మంది పురుషులపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ ఫలితాలు ఓపెన్ యాక్సెస్ ఆండ్రాలజీ జర్నల్ లో ఇటీవల ప్రచురితమయ్యాయి. పురుషులకు ఈ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా స్త్రీలు గర్భం దాల్చకుండా దీనిని రూపొందించారు.


పురుషులు ఈ ఇంజక్షన్ తీసుకోవడం వల్ల వీర్య కణాలు శక్తి తగ్గుతుంది. దీంతో మహిళల్లో గర్భధారణ అవకాశాలు తగ్గుతాయి. ఫలితంగా ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఐసీఎంఆర్ ట్రయిల్స్ లో తెలియజేసింది. దేశ వ్యాప్తంగా ఐదు వేర్వేరు ప్రాంతాల్లో ట్రయిల్స్ నిర్వహించారు. అధ్యయనంలో భాగంగా వేసేక్టమీ శస్త్ర చికిత్సల కోసం 303 మంది ఆరోగ్య కరమైన లైంగిక సామర్థ్యం కలిగిన పురుషులను గుర్తించారు. వారికి 60 ఎంజీ ఆర్ఐఎస్ యూజీ ఇంజక్షన్ చేశారు. ఇది 99.02 శాతం కచ్చితత్వంతో పనిచేసిందని ఎలాంటి చెడు ప్రభావాలు చూపలేదని అధ్యయనంలో వెల్లడైంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>