Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2888f495-f4b8-4d86-a273-7466eefe10da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2888f495-f4b8-4d86-a273-7466eefe10da-415x250-IndiaHerald.jpgఈ తరం టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ రాజసులోచన అప్పట్లో చాలా పాపులర్ నటిగా, డ్యాన్సర్ గా వెలుగొందేది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో పనిచేసింది.ఈమె అసలు పేరు రాజలోచన, తల్లిదండ్రులకు ఆమె ఏకైక సంతానం. అందుకే చిన్నతనం నుంచి ఎంతో గారాబంగా పెంచేవారు. ఆమె పట్ల తమకున్న గౌరవాన్ని, అభిమానాన్ని తెలియజేసేందుకు ఆమె పేరు ముందు రాజా అనే పదాన్ని కూడా చేర్చారు. అయితే, ఆమె పాఠశాలలో చేరినప్పుడు, ఆమె పేరు తప్పుగా రాజసులోచన అని రాయడం జరిగింది, అదే చివరికి ఆమె అఫీషియల్ పేరsocialstars lifestyle{#}NTR;raja;Tollywood;Director;Parents;Heroine;Darsakudu;Ishtam;Chitram;Cinemaఅలాంటి నటిని స్టార్ హీరోయిన్ గా మార్చిన సీనియర్ ఎన్టీఆర్....!!అలాంటి నటిని స్టార్ హీరోయిన్ గా మార్చిన సీనియర్ ఎన్టీఆర్....!!socialstars lifestyle{#}NTR;raja;Tollywood;Director;Parents;Heroine;Darsakudu;Ishtam;Chitram;CinemaSun, 22 Oct 2023 08:50:00 GMTఈ తరం టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ రాజసులోచన అప్పట్లో చాలా పాపులర్ నటిగా, డ్యాన్సర్ గా వెలుగొందేది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో పనిచేసింది.ఈమె అసలు పేరు రాజలోచన, తల్లిదండ్రులకు ఆమె ఏకైక సంతానం. అందుకే చిన్నతనం నుంచి ఎంతో గారాబంగా పెంచేవారు. ఆమె పట్ల తమకున్న గౌరవాన్ని, అభిమానాన్ని తెలియజేసేందుకు ఆమె పేరు ముందు రాజా అనే పదాన్ని కూడా చేర్చారు. అయితే, ఆమె పాఠశాలలో చేరినప్పుడు, ఆమె పేరు తప్పుగా రాజసులోచన అని రాయడం జరిగింది, అదే చివరికి ఆమె అఫీషియల్ పేరుగా మారింది.రాజసులోచన చిన్నతనం నుంచే డ్యాన్స్‌ని ఇష్టపడింది, ఆ అభిరుచిగా పెద్దయ్యాక కూడా కొనసాగించింది. సినిమాల్లో నర్తకి గా కనిపించాలని ఆశపడింది. ఆమె కలలను నెరవేర్చడంలో తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ నటి తన తండ్రికి ఇష్టం లేని వేశ్య పాత్రతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. తన తల్లి ప్రోత్సాహంతోనే వేశ్య అయినా పెద్దగా భయపడకుండా ఆమె అందులో నటించింది.

దురదృష్టవశాత్తు, ఆ పాత్ర ఆమెకు కళంకంలా మారింది. ఆమె చాలా సినిమాల్లో వేశ్యగా టైప్‌కాస్ట్ చేయబడింది. ప్రతి డైరెక్టర్ ఆమెను అలాంటి పాత్ర చేయాలని అడగడంతో ఇక కెరీర్ తనపై వేశ్య అనే ముద్ర వేసిందని ఆమె ఎంతో బాధపడింది. తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చే ఒక్క దర్శకుడు కూడా దొరకడా అని ఎంతో ఆశించింది. చివరికి తనకు వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రావడం కష్టమే అని నిరాశ పడిపోయింది. ప్రజలు ఆమెను బయట కూడా వేశ్యగా చూసేవారు. ఆ ఇమేజ్ కారణంగా ఆమె తన వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలను ఎదుర్కొంది.  సరిగ్గా అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు తన టైగర్ రాముడు సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. దాంతో ఆమె ఫేట్ మారిపోయింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది, రాజ సులోచన కథానాయికగా స్థిరపడింది. ఆమె ఎన్టీఆర్‌తో మరో నాలుగు సినిమాల్లో నటించింది, అవన్నీ విజయవంతమయ్యాయి. ఆమె తన కెరీర్‌లో తరువాత వివిధ క్యారెక్టర్స్‌ కూడా పోషించింది. అలా రాజ సులోచనను వేశ్య పాత్రల నుంచి ఎంతో మంది అభిమానించే హీరోయిన్ గా మార్చడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆ టైం లో అక్కినేని కూడా ఆమెను బాగానే ఎంకరేజ్ చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>