Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bapayyae3a16a64-0520-4493-abdb-be26ddfa2ad2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bapayyae3a16a64-0520-4493-abdb-be26ddfa2ad2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ బాక్సాఫీస్ వద్ద మూడు భారీ సినిమాలు విడుదలయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ మూడు కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయ్. ఇందులో ఒకటి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంతు కేసరి సినిమా. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడుగా కొనసాగుతున్న అనిల్ రావిపూడి టేకింగ్ లో బాలయ్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కింది ఈ మూవీ. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల నటింBapayya{#}sree;festival;Dalapathi;Ravi;ravi teja;Akkineni Nageswara Rao;Chiranjeevi;anil ravipudi;kajal aggarwal;Kesari;Balakrishna;shankar;Joseph Vijay;Cinema;Teluguబాలయ్య 'భగవంత్ కేసరి' ఫస్ట్ డే కలెక్షన్స్.. చిరు డిజాస్టర్ మూవీని దాటలేదా?బాలయ్య 'భగవంత్ కేసరి' ఫస్ట్ డే కలెక్షన్స్.. చిరు డిజాస్టర్ మూవీని దాటలేదా?Bapayya{#}sree;festival;Dalapathi;Ravi;ravi teja;Akkineni Nageswara Rao;Chiranjeevi;anil ravipudi;kajal aggarwal;Kesari;Balakrishna;shankar;Joseph Vijay;Cinema;TeluguSat, 21 Oct 2023 09:20:00 GMTప్రస్తుతం సౌత్ బాక్సాఫీస్ వద్ద మూడు భారీ సినిమాలు విడుదలయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ మూడు కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయ్. ఇందులో ఒకటి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంతు కేసరి సినిమా. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడుగా కొనసాగుతున్న అనిల్ రావిపూడి టేకింగ్ లో బాలయ్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కింది ఈ మూవీ.  ఇటీవలే విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి.


 ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల నటించింది. అయితే ఒక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అంటే చాలు ఆ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలయ్య నటించిన భగవంతు కేసరి ఫస్ట్ డే కలెక్షన్స్ 32 కోట్ల వరకు వచ్చాయి అన్నది తెలుస్తుంది. కానీ ఇక ఈ కలెక్షన్స్ అటు మెగాస్టార్ చిరంజీవి డిజాస్టర్ మూవీ అయినా బోళా శంకర్ మొదటి రోజు కలెక్షన్స్ ని దాటలేకపోయాయి అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.


 భగవంతు కేసరి తో పాటు దళపతి విజయ్ లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీస్ కూడా భారీ అంచనాల మధ్య విడుదల కావడంతో ఇక భగవంతు కేసరి ఊహించని స్థాయిలో స్క్రీన్లను పంచుకోవాల్సి వచ్చింది. అయితే బోళా శంకర్ మూవీ విడుదలైన సమయంలో ఇలాంటి పరిస్థితి లేదు. రజిని జైలర్ సినిమా పెద్దగా అంచాలు లేకుండానే ఇక్కడ థియేటర్లో విడుదలైంది. దీంతో బోళా శంకర్ సినిమాకి భారీ రేంజ్ లో ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పాలి. అయితే తొలిరోజే భగవంతు కేసరి సినిమా 25% టార్గెట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే పండుగ దినాలలో ఇక కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అట సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>