Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pwanc911f212-34a3-47c6-a563-6f84b778f652-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pwanc911f212-34a3-47c6-a563-6f84b778f652-415x250-IndiaHerald.jpgసాదరణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్ల కాంబినేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే రిపీట్ అవ్వని కొన్ని కాంబినేషన్స్ తో సినిమా వస్తే బాగుండని ఎంతోమంది ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు అయితే దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి కాంబినేషన్స్ తమ సినిమాల్లో పెట్టాలని అనుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు అని చెప్పాలి. ఇలా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆశపడిన కాంబినేషన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దివంగత హీరోయిన్ సౌందర్య కాంబినేషన్ కూడా ఒకటి. చిరంజీవి తమ్ముడుగా హీరోగా ఎంట్రీ ఇPwan{#}Soundarya;Pawan Kalyan;Suswagatham;Girl;Blockbuster hit;Hero;Audience;kalyan;Telugu;Chiranjeevi;Heroine;Cinemaపవన్ - సౌందర్య కాంబినేషన్లో.. ఆ సూపర్ హిట్ మూవీ మిస్ అయిందా?పవన్ - సౌందర్య కాంబినేషన్లో.. ఆ సూపర్ హిట్ మూవీ మిస్ అయిందా?Pwan{#}Soundarya;Pawan Kalyan;Suswagatham;Girl;Blockbuster hit;Hero;Audience;kalyan;Telugu;Chiranjeevi;Heroine;CinemaSat, 21 Oct 2023 13:30:00 GMTసాదరణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్ల కాంబినేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే రిపీట్ అవ్వని కొన్ని కాంబినేషన్స్ తో సినిమా వస్తే బాగుండని ఎంతోమంది ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు  అయితే దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి కాంబినేషన్స్ తమ సినిమాల్లో పెట్టాలని అనుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు అని చెప్పాలి. ఇలా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆశపడిన కాంబినేషన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దివంగత హీరోయిన్ సౌందర్య కాంబినేషన్ కూడా ఒకటి. చిరంజీవి తమ్ముడుగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస హిట్ల తో దూసుకుపోయి ఏకంగా తెలుగు ప్రేక్షకుల పవర్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.


 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత,  సుస్వాగతం లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా సుస్వాగతం మూవీలో పవన్ ఇక తెలుగు ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరయ్యాడు అని చెప్పాలి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడిగా సీనియర్ హీరోయిన్ దేవయాని నటించింది. అయితే ముందుగా ఈ మూవీలో హీరోయిన్గా అనుకున్నది మాత్రం మరో హీరోయిన్ నట. ఆమె ఎవరో కాదు సౌందర్య. సౌందర్యను ఈ మూవీలోకి తీసుకోవాలని అనుకున్నారు. చర్చలు కూడా జరిపారు. ఆమె కూడా ఓకే చెప్పింది. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదట.


 అప్పటికే సౌందర్య స్టార్ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయింది. దీంతో అంత గొప్ప నటితో నటించే ధైర్యం నాకు లేదు. ఆమె నటన ముందు నా నటన సరిపోదు. ఆమె బదులు వేరే హీరోయిన్ ను తీసుకోమని దర్శక నిర్మాతలను కోరాడట. దీంతో దర్శక నిర్మాతలు కూడా చేసేదేమీ లేక దేవయానిని సుస్వాగతం సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ఇలా పవన్ కళ్యాణ్ సౌందర్య కాంబినేషన్లో రావాల్సిన బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయింది అని చెప్పాలి. ఈ విషయం తెలిసి ఈ కాంబినేషన్ రిపీట్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని అభిమానులు కూడా అనుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>