Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bangaladeshab8348bd-499e-422e-bb91-1f90a7712a2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bangaladeshab8348bd-499e-422e-bb91-1f90a7712a2d-415x250-IndiaHerald.jpgసాధారణంగా మాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొంతమంది ప్లేయర్లు తెలియకుండానే మ్యాచ్ గెలవాలి అనే ఉత్సాహంతో కొన్ని కొన్ని తప్పులను చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రత్యర్థి ఆటగాళ్లు ఎవరైనా సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో కొంతమంది బౌలర్లు ఎలాగైనా వికెట్ తీసి సెంచరీ రాకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో వైవిధ్యమైన బంతులను కూడా సంధిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొంతమంది బౌలర్లు మాత్రం కాస్త కన్నింగ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఏకంగా సెంచరీకి చేరువలో ఉన్న బ్యాట్సBangaladesh{#}ahmed;GEUM;Bangladesh;VIRAT KOHLI;INTERNATIONALకోహ్లీ సెంచరీ ముందు.. వైడ్ కావాలని వేయలేదు : బంగ్లా కెప్టెన్కోహ్లీ సెంచరీ ముందు.. వైడ్ కావాలని వేయలేదు : బంగ్లా కెప్టెన్Bangaladesh{#}ahmed;GEUM;Bangladesh;VIRAT KOHLI;INTERNATIONALSat, 21 Oct 2023 15:30:00 GMTసాధారణంగా మాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొంతమంది ప్లేయర్లు తెలియకుండానే మ్యాచ్ గెలవాలి అనే ఉత్సాహంతో కొన్ని కొన్ని తప్పులను చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రత్యర్థి ఆటగాళ్లు ఎవరైనా సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో కొంతమంది బౌలర్లు ఎలాగైనా వికెట్ తీసి సెంచరీ రాకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో వైవిధ్యమైన బంతులను కూడా సంధిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 కానీ కొంతమంది బౌలర్లు మాత్రం కాస్త కన్నింగ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఏకంగా సెంచరీకి చేరువలో ఉన్న బ్యాట్స్మెన్ కి ఆ సెంచరీ వైడ్ ద్వారా పూర్తి చేయించాలి అనే ఉద్దేశంతో అనవసరంగా వైడ్లు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటివి ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో చాలా సార్లు జరిగాయి. అయితే ఇలా అనవసరంగా వైడ్లు వేసిన క్రికెటర్ల పై విమర్శలు కూడా చాలానే వచ్చాయి అని చెప్పాలి. అయితే ఇండియ, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటి ఘటన ఒకటి జరిగిందని అందరికీ అనిపించింది.


 బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే.అయితే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో.. విరాట్ కోహ్లీ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ ఉండగా.. బంగ్లాదేశ్ బౌలర్ అహ్మద్ లెగ్ సైడ్ బంతిని విసిరాడు. అయితే అది వైడ్ గా వెళ్ళింది. కానీ అంపైర్ మాత్రం ఆ బాల్ వైడ్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే కోహ్లీ సెంచరీని అడ్డుకునే క్రమంలోనే అహ్మద్ వైడ్ వేశాడు అంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే జట్టు కెప్టెన్ నజ్ముల్ ఇదే విషయంపై స్పందించాడు. మాకు వైడ్ వెయ్యాలనే ఉద్దేశం లేదు. ఏ బౌలర్ కూడా కావాలని వైట్ వేయాలని అనుకోడు. మంచి గేమ్ ఆడటానికి ప్రయత్నించాం అంటూ చెప్పుకొచ్చాడు నాజ్ముల్..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>