Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik06327a93-b983-4dde-80dd-c266e470b429-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik06327a93-b983-4dde-80dd-c266e470b429-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా ఈ నాలుగు మ్యాచ్లలో కూడా విజయం సాధించి అదరగొట్టింది. ఇలా ఓటమి ఎరుగని ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ప్రత్యర్థులను భయపెడుతుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం న్యూజిలాండ్ టీం ఇండియా మధ్యపోటీ నెలకొంది అని చెప్పాలి. ఈ రెండు జట్లు కూడా నాలుగు మ్యాచ్లకు గాను నాలుగంటిలో కూHardik{#}ishaan actor;surya sivakumar;Hardik Pandya;Bangladesh;World Cup;India;October;New Zealandహార్దిక్ స్థానంలో సూర్య కాదు.. ఎవరు జట్టులోకి వస్తున్నారంటే?హార్దిక్ స్థానంలో సూర్య కాదు.. ఎవరు జట్టులోకి వస్తున్నారంటే?Hardik{#}ishaan actor;surya sivakumar;Hardik Pandya;Bangladesh;World Cup;India;October;New ZealandSat, 21 Oct 2023 17:00:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే  ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా ఈ నాలుగు మ్యాచ్లలో కూడా విజయం సాధించి అదరగొట్టింది. ఇలా ఓటమి ఎరుగని ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ప్రత్యర్థులను భయపెడుతుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం న్యూజిలాండ్ టీం ఇండియా మధ్యపోటీ నెలకొంది అని చెప్పాలి.


ఈ రెండు జట్లు కూడా నాలుగు మ్యాచ్లకు గాను నాలుగంటిలో కూడా విజయం సాధించాయ్. దీంతో పాయింట్ల పరంగా రెండు సమానంగానే ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ టీమ్ ఇండియాకు కాస్త తక్కువగా ఉండడంతో.. ఇక న్యూజిలాండ్ మొదటి స్థానంలో.. ఇండియా రెండవ స్థానంలో ఉన్నాయి. అయితే అక్టోబర్ 22వ తేదీన పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. అగ్రస్థానంలోకి వెళ్లేందుకు టీమిండియాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ కి ముందు టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.


 బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. న్యూజిలాండ్తో మ్యాచ్కి అతను అందుబాటులో ఉండడు. దీంతో అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారు అనే చర్చ మొదలైంది. అయితే ఈ వరల్డ్ కప్ లో బెంచ్ కే పరిమితమైన సూర్యకుమార్ను తుది జట్టులోకి తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ సూర్య కుమార్ ను కాకుండా ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి తీసుకోబోతున్నారట సెలక్టర్లు. కాగా గత కొంతకాలం నుంచి ఏ ఆటగాడు గాయపడిన ఇషాన్ కిషోన్నే జట్టులోకి తీసుకోవడానికి మొదటి ఆప్షన్ గా చూస్తున్నారు సెలెక్టర్లు. ఇక ఇప్పుడు కూడా హార్దిక్ స్థానంలో ఇషాన్ కిషోన్నే జంటలోకితీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>