Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/warnera1d3cc61-22a0-4a74-bde7-804caeaeb053-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/warnera1d3cc61-22a0-4a74-bde7-804caeaeb053-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పరుగుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ భారీగా స్కోర్లు నమోదు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక సెంచరీల మోత మోగిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా తమ అభిమాన ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగిపోతూ ఉండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి అని చెప్పాలి. సాధారణంగా ఒక్క మ్యాచ్లో ఒక జట్టుకు చెందిన ఒక ఆటగాడు సెంచరీ చేస్తేనే ఆ టీం భారీ స్కోరు సాధిస్తుంది. Warner{#}Rohit Sharma;Cricket;Pakistan;Australia;India;World Cupసూపర్ సెంచరీతో.. అరుదైన రికార్డు సృష్టించిన వార్నర్?సూపర్ సెంచరీతో.. అరుదైన రికార్డు సృష్టించిన వార్నర్?Warner{#}Rohit Sharma;Cricket;Pakistan;Australia;India;World CupSat, 21 Oct 2023 10:30:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పరుగుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ భారీగా స్కోర్లు నమోదు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక సెంచరీల మోత మోగిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఇలా తమ అభిమాన ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగిపోతూ ఉండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి అని చెప్పాలి. సాధారణంగా ఒక్క మ్యాచ్లో ఒక జట్టుకు చెందిన ఒక ఆటగాడు సెంచరీ చేస్తేనే ఆ టీం భారీ స్కోరు సాధిస్తుంది.


 అలాంటిది ఓపెనర్లుగా వచ్చిన ఇద్దరు ప్లేయర్లు సెంచరీలతో చెలరేగి పోతే ఇక ఆ జట్టుకు విజయం వరించడం ఖాయం అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది. వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మొదట్లో వరుసగా ఓటములు చవిచూసిన ఈ టీం ఇక ఇప్పుడు మాత్రం వరుస విజయాలు సాధిస్తూ పట్టు బిగిస్తూ ఉంది అని చెప్పాలి  ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో కూడా ఘన విజయాన్ని అందుకుంది ఆస్ట్రేలియా.


 కాగా గత కొన్ని రోజులు నుంచి సరైన ఫామ్ లో బ్యాటింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్న డేవిడ్ వార్నర్.. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం సెంచరీ తో చెలరేగిపోయాడు. 124 బంతుల్లో 163 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ ఒక సరి కొత్త రికార్డును సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 150 ప్లస్ రన్స్ చేయడం డేవిడ్ వార్నర్ కు ఇది ఏడవ సారి. కాగా వార్నర్ కంటే ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 8 సార్లు 150 ప్లస్ స్కోర్ చేసి టాప్ లో ఉన్నాడు. అయితే వరల్డ్ కప్ లో ఈ ఫీట్ సాధించడం వార్నర్ కు ఇది మూడోసారి అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>