HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips6b5f4753-c1bf-4a7d-9491-7723de80182c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips6b5f4753-c1bf-4a7d-9491-7723de80182c-415x250-IndiaHerald.jpgషుగర్ జబ్బుతో బాదపడే వారు తరుచూ రక్తపరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. కొందరు అయితే ఇంట్లోనే ఈ పరీక్షలు చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఆహారం తీసుకోవడానికి ముందు ఆహారం తీసుకున్న రెండు గంటల తరువాత షుగర్ కు సంబంధించిన రక్తపరీక్షలు చేసుకోవాలి. అయితే మనం రాత్రి పూట స్వీట్స్ ను, అన్నాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉదయం పూట రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే మధ్యాహ్నం పూట అన్నాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా షుగర్ ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది.ఇక మనం పుల్కాలను తింటూ కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తHealth Tips{#}gummadi;Mandula;Evening;Sugar;Manamఇలా చేస్తే షుగర్ మీ లైఫ్ లో రానే రాదు?ఇలా చేస్తే షుగర్ మీ లైఫ్ లో రానే రాదు?Health Tips{#}gummadi;Mandula;Evening;Sugar;ManamFri, 20 Oct 2023 21:31:00 GMTషుగర్ జబ్బుతో బాదపడే వారు తరుచూ రక్తపరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. కొందరు అయితే ఇంట్లోనే ఈ పరీక్షలు చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఆహారం తీసుకోవడానికి ముందు  ఆహారం తీసుకున్న రెండు గంటల తరువాత షుగర్ కు సంబంధించిన రక్తపరీక్షలు చేసుకోవాలి. అయితే మనం రాత్రి పూట స్వీట్స్ ను, అన్నాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉదయం పూట రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే మధ్యాహ్నం పూట అన్నాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా షుగర్ ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది.ఇక మనం పుల్కాలను తింటూ కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపరీక్షలల్లో షుగర్ తక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది.అయితే మనం వాడే మందులతో పాటు ఆహార నియమాలను మార్చుకోవడం వల్ల కూడా హెబిఎ1సి టెస్ట్ లో మనం షుగర్ ను 5 లోపు లేదా 5 కంటే తక్కువగా ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ రెండు పూటలా మాత్రమే ఆహారాన్ని తీసుకుని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనం చాలా ఈజీగా అదుపులో ఉంచుకోవచ్చని వారు చెబుతున్నారు.


ప్రతి రోజూ ఉదయం పూట 10 లోపు కేవలం నీటిని మాత్రమే తాగి ఉండాలి. 10 గంటలకు ఒక గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ లో 2 టీ స్పూన్ల తేనెని కలిపి తీసుకోవాలి. ఆ జ్యూస్ తాగిన గంట తరువాత రెండు పుల్కాలను రెండు చప్పటి కూరలతో తీసుకోవాలి. పైగా కూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తరువాత గంటకొక గ్లాస్ నీటిని తాగుతూ ఉండాలి.ఇలా సాయంత్రం 4 గంటల దాకా నీటిని తాగుతూ ఉండాలి. ఆ తరువాత ఒక గ్లాస్ కొబ్బరి నీటిని తాగాలి. ఇంకా అలాగే మొలకెత్తిన గింజలను, వాల్ నట్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలను నానబెట్టి తీసుకోవాలి. అలాగే మీరు పండ్లను కూడా తీసుకోవాలి. వీటిని తీసుకున్న తరువాత ఒక గంటపాటు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. మీరు ఇలా 3 నెలల పాటు చేయడం వల్ల హెబిఎ1సి 6 లోపు వస్తుంది. దీంతో మనం వాడే మందుల మోతాదును కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చని మన శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని అలాగే షుగర్ కారణంగా అవయవాలు దెబ్బతినకుండా చూసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>