MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-leo-collections8e6fab22-7e8f-4c88-bd10-323947096dc9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-leo-collections8e6fab22-7e8f-4c88-bd10-323947096dc9-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం లియో.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది వారసుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దళపతి.. తాజాగా లియో సినిమాతో నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే బ్లాక్ బాస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. VIJAY LEO; COLLECTIONS{#}Kerala;Varasudu;Tamilnadu;Chitram;Hero;News;India;Dalapathi;Trisha Krishnan;Joseph Vijay;Arjun;Director;media;Mass;Cinemaసంచలనం సృష్టించిన విజయ్ లియో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?సంచలనం సృష్టించిన విజయ్ లియో.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?VIJAY LEO; COLLECTIONS{#}Kerala;Varasudu;Tamilnadu;Chitram;Hero;News;India;Dalapathi;Trisha Krishnan;Joseph Vijay;Arjun;Director;media;Mass;CinemaFri, 20 Oct 2023 10:00:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం లియో.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది వారసుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దళపతి.. తాజాగా లియో సినిమాతో నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే బ్లాక్ బాస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది.


ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే..  మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ .140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ విజయ్ కెరియర్ లోనే ఒక సాలిడ్ ఓపెనింగ్ అని అభిమానులు భావిస్తున్నారు. అర్జున్ , సంజయ్ దత్, త్రిష కీలకమైన పాత్రలలో నటించడం జరిగింది. మాస్ యాక్షన్ డ్రామా  గా తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్స్ గురించి ఇంకా అధికారికంగా చిత్ర బృందం తెలియజేయలేదు.  కేవలం సోషల్ మీడియా ఆధారంగానే ఈ విషయం వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియాలో నిన్న ఒక్కరోజు రూ. 63 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా రూ .66 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.


బాక్సాఫీస్ లియో కలెక్షన్స్ విషయానికి వస్తే..  తమిళనాడు రూ.30 కోట్లు, కేరళ రూ .11 కోట్లు, కర్ణాటక రూ.14 ,తెలుగు రెండు రాష్ట్రాలలో రూ .14 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియా నాలుగు కోట్ల రూపాయలు రాబట్టి నట్లు తెలుస్తోంది.దాదాపుగా త్రిష,  విజయ్ కాంబినేషన్ 13 ఏళ్ల తర్వాత రావడంతో ఈ జోడీకి మంచి క్రేజ్ ఏర్పడింది. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా తమిళనాడులో కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లు రాబట్టిందనే విషయం తెలియాల్సి ఉన్నది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>