MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og-movie35ca7d61-9ea9-47f8-9df6-4381fe865cb7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og-movie35ca7d61-9ea9-47f8-9df6-4381fe865cb7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ప్రజల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీని ఏర్పాటు చేసి రాజకీయపరంగా మరింత బిజీగా మారిన ఈయన సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వచ్చే ఏడాది ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒకవైపు రాజకీయ ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నా .. మరొకవైపు తన అభిమానులకు వినోదాన్ని పంచడానికి వరుస సినిమాలు ప్రకటిస్తOG MOVIE{#}Shriya Reddy;sujeeth;Janasena;kalyan;December;News;priyanka;Elections;Hero;Cinemaపవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. ఓజీ సినిమా షూటింగ్ షురూ.. !పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. ఓజీ సినిమా షూటింగ్ షురూ.. !OG MOVIE{#}Shriya Reddy;sujeeth;Janasena;kalyan;December;News;priyanka;Elections;Hero;CinemaFri, 20 Oct 2023 09:00:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ప్రజల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీని ఏర్పాటు చేసి రాజకీయపరంగా మరింత బిజీగా మారిన ఈయన సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వచ్చే ఏడాది ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒకవైపు రాజకీయ ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నా .. మరొకవైపు తన అభిమానులకు వినోదాన్ని పంచడానికి వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ (OG) పేరుతో పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో కొడైకెనాల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇక దీనికోసం రెండు వారాల సమయాన్ని పవన్ కళ్యాణ్ కేటాయించినట్లు తెలుస్తోంది.  ఇక ఈ రెండు వారాలు ఆయన తమిళనాడులోని కొడైకెనాల్ లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య సుమారుగా రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ఇందులో ఇమ్రాన్ హస్మి, ప్రియాంక అరుల్ మోహన్,  ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఇక వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే సినిమా షూటింగ్ మొదలుపెట్టి అభిమానులకు మంచి కిక్కిచ్చే న్యూస్ ఇచ్చారు చిత్ర బృందం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>