Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleef3bfe81-8b2a-4c29-a7a4-bf45bf61205b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleef3bfe81-8b2a-4c29-a7a4-bf45bf61205b-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ వ్యాఖ్యాతగా రూపొందిన వినోదాత్మక టాక్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. తెలుగు ఓటీటీ 'ఆహా' వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం మూడవ సీజన్ కూడా ఎంతో ఘనంగా ప్రారంభమైంది మూడవ సీజన్ కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 17వ తేదీ ప్రసారమైంది. కార్యక్రమంలో భాగంగా మొదటి గెస్టులుగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు హీరోయిన్స్ అలాగే విలన్ పాత్రలోsocialstars lifestyle{#}Arjun Rampal;Kanna Lakshminarayana;Episode;Director;Fidaa;Telugu;anil ravipudi;Balakrishna;Kesari;Hero;Cinema;Heroineఅలాంటి వ్యక్తులు నాకు నాన్నతో సమానం అంటున్న బాలయ్య బాబు....!!అలాంటి వ్యక్తులు నాకు నాన్నతో సమానం అంటున్న బాలయ్య బాబు....!!socialstars lifestyle{#}Arjun Rampal;Kanna Lakshminarayana;Episode;Director;Fidaa;Telugu;anil ravipudi;Balakrishna;Kesari;Hero;Cinema;HeroineThu, 19 Oct 2023 20:54:00 GMTబాలకృష్ణ వ్యాఖ్యాతగా రూపొందిన వినోదాత్మక టాక్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. తెలుగు ఓటీటీ 'ఆహా' వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం మూడవ సీజన్ కూడా ఎంతో ఘనంగా ప్రారంభమైంది మూడవ సీజన్ కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 17వ తేదీ ప్రసారమైంది. కార్యక్రమంలో భాగంగా మొదటి గెస్టులుగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు హీరోయిన్స్ అలాగే విలన్ పాత్రలో నటించిన అర్జున్ రాంపాల్ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణ అని ఒక ప్రశ్న వేశారు మీ కన్నా వయసులో నేను చాలా చిన్నవాడిని అలాగే నేను చేసింది కేవలం 7 సినిమాలు మాత్రమే కానీ మీరు నాకు సినిమా షూటింగ్లో కనుక ఉంటే నన్ను గురువుగారు అని పిలుస్తారు. మీరు అలా పిలవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇది మీరు స్థానానికి ఇచ్చే గౌరవానికి నేను ఫిదా అయ్యాను అంటూ అనిల్ రావిపూడి ఈ సందర్భంగా మాట్లాడారు ఇలా అనిల్ రావిపూడి మాట్లాడిన వ్యాఖ్యలకు బాలయ్య సమాధానం చెబుతూనేను చేసే ఏ సినిమా డైరెక్టర్ అయిన నాకు నాన్నగారితో సమానం అని బాలయ్య తెలిపారు.   డైరెక్టర్ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నాకు తండ్రితో సమానమే ఎందుకంటే వాళ్ళు నా పాత్రకు ప్రాణం పోస్తారు.

అందుకే డైరెక్టర్ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరిని నేను ఎంతో గౌరవంగా గురువుగారు అని పిలుస్తాను అంటూ బాలకృష్ణ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏది ఏమైనా బాలకృష్ణ దర్శక నిర్మాతల హీరో అనే పేరు ఈయనకు ఉంది ఈయన సినిమాలు చేసే సమయంలో దర్శకులు చెప్పినట్టుగానే నడుచుకుంటారు తప్ప ఈయన దర్శకులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వరని, రెమ్యూనరేషన్ విషయంలో కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టరు అంటూ కూడా బాలయ్య గురించి ఒక వార్త ఇండస్ట్రీలో వినపడుతూనే ఉంటుంది. ఇక తాజాగా అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈయన దర్శకులకు ఎంతటి గౌరవం ఇస్తారో స్పష్టంగా అర్థమవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>