Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebeda0661-0654-48bc-91e5-c1b0dd2714ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebeda0661-0654-48bc-91e5-c1b0dd2714ed-415x250-IndiaHerald.jpgతరం మారింది. ఆలోచనలు కూడా మారాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలలోని కంటెంట్ నచ్చితేగాని సినిమాలను చూడడంలేదు నేటి సినిమా ప్రేక్షకులు. పైగా ఈ ఓటిటిలు వచ్చిన తరువాత ఈ మార్పు చాలా బాగా కనిపిస్తోంది.అందుకే చిన్నా చితకా హీరోలనుండి పెద్ద పెద్ద హీరోల వరకు అందరూ ఇపుడు యంగ్ డైరెక్టర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వారి ఆలోచనలు కొత్తగా ఉంటాయి. వారి ఆలోచనలు ఈ జనరేషన్ కు తగ్గట్టుగా ఉంటాయి. అయితే ఈ క్రమంలో పాత డైరెక్టర్లు కాస్త వెనకబడ్డారనే చెప్పుకోవాలి.అయితే ఒక స్టోరీని తెరపైకి ఎక్కించడంలో పాత డైరెక్టర్లు విsocialstars lifestyle{#}chinna;Fidaa;vegetable market;Venkatesh;sandeep;Darsakudu;Tollywood;Telugu;anil ravipudi;Balakrishna;Kesari;Director;Lokesh;Lokesh Kanagaraj;Cinemaయంగ్ డైరెక్టర్స్ వైపు వాలిపోతున్న సీనియర్ హీరోలు....!!యంగ్ డైరెక్టర్స్ వైపు వాలిపోతున్న సీనియర్ హీరోలు....!!socialstars lifestyle{#}chinna;Fidaa;vegetable market;Venkatesh;sandeep;Darsakudu;Tollywood;Telugu;anil ravipudi;Balakrishna;Kesari;Director;Lokesh;Lokesh Kanagaraj;CinemaThu, 19 Oct 2023 07:55:00 GMTతరం మారింది. ఆలోచనలు కూడా మారాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలలోని కంటెంట్ నచ్చితేగాని సినిమాలను చూడడంలేదు నేటి సినిమా ప్రేక్షకులు. పైగా ఈ ఓటిటిలు వచ్చిన తరువాత ఈ మార్పు చాలా బాగా కనిపిస్తోంది.అందుకే చిన్నా చితకా హీరోలనుండి పెద్ద పెద్ద హీరోల వరకు అందరూ ఇపుడు యంగ్ డైరెక్టర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వారి ఆలోచనలు కొత్తగా ఉంటాయి. వారి ఆలోచనలు ఈ జనరేషన్ కు తగ్గట్టుగా ఉంటాయి. అయితే ఈ క్రమంలో పాత డైరెక్టర్లు కాస్త వెనకబడ్డారనే చెప్పుకోవాలి.అయితే ఒక స్టోరీని తెరపైకి ఎక్కించడంలో పాత డైరెక్టర్లు విఫలం అవరు. కానీ కొత్తవారి వద్ద కాస్త జాగ్రత్తగా వుండాలి. కారణం ఏదైనా ప్రస్తుతం మాత్రం స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్లతో పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అంతేకాకుండా వాళ్లతో సినిమాలు చేయడం వల్ల మార్కెట్ మరింత పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారని వినికిడి.

 ఇన్నోవేటివ్ ఆలోచనలు, మేకింగ్ స్టయిల్, ప్రజెంటేషన్ విషయంలో కొత్త డైరెక్టర్లు కాస్త మెరుగ్గా సినిమాలను తెరకెక్కించడంతో వారి మేకింగ్ కు ఫిదా అయిపోతున్నారు మన సీనియర్ హీరోలు. దానికి ఉదాహరనే రీసెంట్ గా వచ్చిన సైంధవ్ సినిమా టీజర్. అవును, సాధారణంగా వెంకీ సినిమాపై ఉండే అంచనాల కంటే సైంధవ్‌పై డబుల్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయంటే దానికి డైరెక్టర్ శైలేష్ కొలను అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా మేకింగ్ కొత్తగా ఉంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఏ దర్శకుడు చూపించని విధంగా ప్రజెంట్ చేసారు శైలేష్ కొలను.  ఇక ఇక్కడ బాలయ్య గురించి మాట్లాడుకోవాలి. బాలకృష్ణ అంటేనే ఊరమాస్, క్లాస్ అన్ని కలగలుపుకొని ఉంటాయి. కానీ భగవంత్ కేసరి ట్రైలర్ చూస్తే అందులో కాస్త కొత్తదనం వుంటుంది. అందుకే బాలయ్యకు మామూలుగా ఉండే మార్కెట్ కంటే దీనికి డబుల్ బిజినెస్ జరిగింది. బాలయ్య యాక్షన్ కు అనిల్ రావిపూడి డైరెక్షన్ తోడయ్యే సరికి సినిమా రేంజ్ పెరిగిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇక ఇలా టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు తమిళంలో లోకేష్ కనరాజ్, నెల్సన్ లాంటి యంగ్ డైరెక్టర్స్ హవా కనిపిస్తుంది. వాళ్ల మేకింగ్‌తోనే విక్రమ్, జైలర్ వంటి వందల కోట్లు వసూలు చేసే సినిమాలు వచ్చాయి. ఇక మా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి చెప్పాల్సిన పనిలేదు. మనోడు ఏకంగా బాలీవుడ్లో దూసుకుపోతున్న సంగతి అందరికీ విదితమే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>