EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp2f58c65d-7a35-4d61-bce6-cbfef556d0dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp2f58c65d-7a35-4d61-bce6-cbfef556d0dc-415x250-IndiaHerald.jpgచంద్రబాబు అరెస్టు ఏపీ రాజకీయాలను కుదిపేసింది. చంద్రబాబుని అక్రమంగా జైల్లో పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. అవినీతి జరిగింది కాబట్టే మేం జైలుకు పంపాం అని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా చంద్రబాబు అరెస్టు వెనుక ఉంది ఎవరు.. బీజేపీకి తెలియకుండానే ఇదంతా జరిగిందా అని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ప్రస్తుతం తనపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం తీర్పును రిBJP{#}Nara Lokesh;TDP;YCP;Andhra Pradesh;CBN;News;Party;Bharatiya Janata Party;Fridayబీజేపీకి మెడకు చుట్టుకుంటున్న బాబు కేసులు?బీజేపీకి మెడకు చుట్టుకుంటున్న బాబు కేసులు?BJP{#}Nara Lokesh;TDP;YCP;Andhra Pradesh;CBN;News;Party;Bharatiya Janata Party;FridayThu, 19 Oct 2023 11:00:00 GMTచంద్రబాబు అరెస్టు ఏపీ రాజకీయాలను కుదిపేసింది.  చంద్రబాబుని అక్రమంగా జైల్లో పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. అవినీతి జరిగింది కాబట్టే మేం జైలుకు పంపాం అని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు.  ఇంత వరకు బాగానే ఉన్నా చంద్రబాబు అరెస్టు వెనుక ఉంది ఎవరు.. బీజేపీకి తెలియకుండానే ఇదంతా జరిగిందా అని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.


ప్రస్తుతం తనపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు శుక్రవారం వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ కేసు విషయంలో బీజేపీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.


ఒకవేళ చంద్రబాబు ఈ కేసులో బయటకి వస్తే నారా లోకేశ్ అమిత్ షా ను కలవడం వల్లే ఆయనే బయటకు వచ్చారు అని వైసీపీ నేతలు చెబుతూ ప్రచారం చేసుకుంటారు. ఇప్పటికే పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయన బయటకి వస్తే ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది.


ఒకవేళ ఆయన లోపలే ఉంటే బీజేపీ నేతలే ఇదంతా కావాలని చేస్తున్నారు.  చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందని అందుకు ఈ విషయంలో ఆ పార్టీ అధిష్ఠానం స్పందించడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు గమనిస్తే బీజేపీ హస్తం ఉంటే ఈ పాటికే ఈడీ, ఇన్కం ట్యాక్స్ వాళ్లు రంగ ప్రవేశం చేసేవారు. బెయిల్ కూడా రాదు. నెలల తరబడి జైలులోనే ఉంటారు. మరోవైపు మేమే చేశాం అని వైసీపీ గొప్పలు చెప్పుకుంటుంది.


అసలు ప్రాతినిధ్యం లేని ఏపీలో అరెస్టు వెనుక ఉంది మేమే అని చెబితే బీజేపీకే మైలేజ్ వస్తోంది. కానీ ఇదంతా కేంద్రానికి తెలియకుండా జరుగుతుందా అంటే కచ్చితంగా తెలుసు. అందుకే చంద్రబాబుకి ముందస్తు సమాచారం ఇచ్చారు. లేకపోతే బహిరంగంగా చంద్రబాబు తనను అరెస్టు చేస్తారని ఎలా చెబుతారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>