MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vishwak4ef41342-c8bb-45e8-a626-27048c715d95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vishwak4ef41342-c8bb-45e8-a626-27048c715d95-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఇకపోతే ఈ నటుడు ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ఈ సినిమాను డిసెంబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీ అయినటువంటి డిసెంబర్ 8 వ తేదీనే నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్సVishwak{#}neha shetty;Godavari River;Viswak sen;Nani;Prabhas;Beautiful;vakkantham vamsi;December;Yuva;Cinemaప్రభాస్ మూవీతో తలపడనున్న విశ్వక్ సేన్..?ప్రభాస్ మూవీతో తలపడనున్న విశ్వక్ సేన్..?Vishwak{#}neha shetty;Godavari River;Viswak sen;Nani;Prabhas;Beautiful;vakkantham vamsi;December;Yuva;CinemaThu, 19 Oct 2023 09:15:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఇకపోతే ఈ నటుడు ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ఈ సినిమాను డిసెంబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీ అయినటువంటి డిసెంబర్ 8 వ తేదీనే నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

ఇకపోతే ప్రస్తుతం నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని మొదటి డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇలా ఈ మూవీ ముందు ఒక సినిమా ... ఈ మూవీ విడుదల తేదీన మరో సినిమా విడుదల కానుండడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని మార్చాలి అని ఆలోచనకు వచ్చినట్లు అందులో భాగంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను డిసెంబర్ 24 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే డిసెంబర్ 22 వ తేదీన ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమాతో పోటీగా విశ్వక్ తన సినిమాను విడుదల చేస్తాడా అనేది చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>