Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc5aaece42-beed-4e33-9159-7aa31282c331-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc5aaece42-beed-4e33-9159-7aa31282c331-415x250-IndiaHerald.jpgభారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకుని టీమ్ ఇండియా తప్పకుండా విశ్వవిజేతగా నిలుస్తుందని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. అయితే ఇలా ఎవరో క్రికెట్ విశ్లేషకులు చెప్పడం కాదు.. అటు సొంత దేశంలో జరుగుతున్న వరల్డ్ కప్లో టీమ్ ఇండియా ప్రస్తానం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా టైటిల్ గెలవడం ఖాయం అనే భావన కలుగుతుంది. ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో అన్ని విభాగాల్Icc{#}Rohit Sharma;bhavana;India;Bangladesh;Cricket;World Cupహ్యాట్రిక్ కొట్టిన టీమిండియా.. నేడు బంగ్లాదేశ్ తో పోరుకు రెడీ?హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా.. నేడు బంగ్లాదేశ్ తో పోరుకు రెడీ?Icc{#}Rohit Sharma;bhavana;India;Bangladesh;Cricket;World CupThu, 19 Oct 2023 10:05:00 GMTభారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్  జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకుని టీమ్ ఇండియా తప్పకుండా విశ్వవిజేతగా నిలుస్తుందని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. అయితే ఇలా ఎవరో క్రికెట్ విశ్లేషకులు చెప్పడం కాదు.. అటు సొంత దేశంలో జరుగుతున్న వరల్డ్ కప్లో టీమ్ ఇండియా ప్రస్తానం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా టైటిల్ గెలవడం ఖాయం అనే భావన కలుగుతుంది.


 ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా ప్రత్యర్థులను ప్రతి మ్యాచ్లో కూడా చిత్తు చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఇప్పటికే మూడు మ్యాచ్లు ఆడిన భారత జట్టు.. ఆ మూడు మ్యాచ్లలో కూడా ఘనవిజయాలను సాధించింది. వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ కొట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా.. నేడు బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడబోతుంది అని చెప్పాలి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కాబోతుంది.


 అయితే ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించి జోరు మీద ఉన్న టీమ్ ఇండియాకు బ్రేకులు వేసేందుకు అటు బంగ్లాదేశ్ సిద్ధమవుతుంది అని చెప్పాలి. అయితే అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాను ఓడించడం అంత సులభమైన విషయం కాదు.. అయితే బంగ్లాదేశ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడగా.. ఇందులో రెండింటిలో ఓడిపోగా.. కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. అయితే భారత్ పై విజయం సాధించి అద్భుతం చేయాలని ఆరాటపడుతుంది బంగ్లాదేశ్ టీం. ఎందుకంటే ఆసియా కప్లో టీమిండియా పై బంగ్లాదేశ్ విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ లో ఓటమికి మాత్రం గట్టిగా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది భారత జట్టు. ఏం జరుగుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>