Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya14d26358-ff4c-447b-9202-c1fbe9f87f05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya14d26358-ff4c-447b-9202-c1fbe9f87f05-415x250-IndiaHerald.jpgభారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింతగా పెంచిన డైరెక్టర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి పేరు చెబుతూ ఉంటారు. బాహుబలి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ పేరు దేశమంతా మారుమోగిపోయేలా చేసిన రాజమౌళి.. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని ప్రపంచం మొత్తం ఇండియన్ సినిమా వైపు చూసేలా చేశారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన ఏ సినిమా చేస్తున్నారు అనే విషయంపై సినీ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. అయితే స్టార్ హీరోలను పెట్టుకుంటేనే సినిమాలు సూపర్ హిట్ అవుతాయని వేల కోట్లు సాధిస్తాయని అందరూ అంటూ ఉంటారBalayya{#}Eega;Bahubali;Tiger;Darsakudu;Rajamouli;Blockbuster hit;Oscar;Telugu;Hero;Industries;Indian;Director;Cinema;lionఆ హీరోకి బుద్ధి చెప్పడానికే.. జక్కన్న ఈగ సినిమా తీశాడా?ఆ హీరోకి బుద్ధి చెప్పడానికే.. జక్కన్న ఈగ సినిమా తీశాడా?Balayya{#}Eega;Bahubali;Tiger;Darsakudu;Rajamouli;Blockbuster hit;Oscar;Telugu;Hero;Industries;Indian;Director;Cinema;lionThu, 19 Oct 2023 15:00:00 GMTభారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింతగా పెంచిన డైరెక్టర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి పేరు చెబుతూ ఉంటారు. బాహుబలి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ పేరు దేశమంతా మారుమోగిపోయేలా చేసిన రాజమౌళి.. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని ప్రపంచం మొత్తం ఇండియన్ సినిమా వైపు చూసేలా చేశారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన ఏ సినిమా చేస్తున్నారు అనే విషయంపై సినీ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. అయితే స్టార్ హీరోలను పెట్టుకుంటేనే సినిమాలు సూపర్ హిట్ అవుతాయని వేల కోట్లు సాధిస్తాయని అందరూ అంటూ ఉంటారు.


 కానీ తాను తీసే సినిమాలకు స్టార్ హీరోల అవసరం లేదు చివరికి ఒక ఈగను హీరోగా పెట్టి కూడా సినిమా తీయగలను అని నిరూపించిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి అని చెప్పాలి. చాలామంది స్టార్ హీరోలు తమ వల్లే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని అంటూ ఉంటారు. అయితే ఇలాంటి హీరోలకు బుద్ధి చెప్పడానికి రాజమౌళి ఈగ సినిమాలు తీశాడు అంటూ ఒక వార్త అప్పట్లో వైరల్ గా మారిపోయింది. కేవలం ఈగను హీరోగా పెట్టి తీసి ఏకంగా 50 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ తో తన సత్తా ఏంటో చూపించాడు రాజమౌళి.


 అయితే పులి లేదా సింహం లేదా ఇంకా ఏదైనా జంతువులని హీరోగా పెట్టి సినిమా తీయొచ్చు. కానీ ఏకంగా ఒక ఈగ మీద సినిమా తీయడం అంటే ఎన్నో గట్స్ కావాలి. ఇలాంటి గట్స్ రాజమౌళికి మాత్రమే ఉన్నాయి. అయితే గతంలో ఒకసారి హీరోతో రాజమౌళి సినిమా తెరకెక్కించడం  వల్ల ఆ స్టార్ హీరో ఫ్యామిలీ తమ హీరో లేకపోతే సినిమా సక్సెస్ అయ్యేది కాదని రాజమౌళి ముఖం మీద చెప్పేశారట.  దీంతో రాజమౌళి తన డైరెక్షన్ సత్తా ఏంటో చూపించాలి అని అనుకున్నాడట. ఈ క్రమంలోనే హీరోని పెట్టి కాదు ఈగతో సినిమా తీస్తానని చెప్పి.. శపథం చేసి మరి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడట రాజమౌళి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>