MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd12c02d6-d258-4e88-9b1f-ce47c7c74320-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd12c02d6-d258-4e88-9b1f-ce47c7c74320-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇటీవల వచ్చిన క్రేజీ సినిమా స్కంద. ఇటివల విడుదలై డివైడ్ టాక్ అందుకున్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి అద్భుతంగా నటించి మెప్పించాడు రామ్. బోయపాటి శ్రీను ఓవర్ మాస్ టేకింగ్ తమన్ సంగీతం వల్ల ఈ సినిమాకి కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది అని అంటున్నారు సినీ లవర్స్. కానీ క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 47 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్tollywood{#}boyapati srinu;contract;ram pothineni;thaman s;Mass;cinema theater;Success;News;October;Audience;Cinemaఅనుకున్న దానికంటే ముందే ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న స్కంద..!?అనుకున్న దానికంటే ముందే ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న స్కంద..!?tollywood{#}boyapati srinu;contract;ram pothineni;thaman s;Mass;cinema theater;Success;News;October;Audience;CinemaThu, 19 Oct 2023 17:25:00 GMTటాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇటీవల వచ్చిన క్రేజీ సినిమా స్కంద. ఇటివల విడుదలై డివైడ్ టాక్ అందుకున్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి అద్భుతంగా నటించి మెప్పించాడు రామ్. బోయపాటి శ్రీను ఓవర్ మాస్ టేకింగ్ తమన్ సంగీతం వల్ల ఈ సినిమాకి కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది అని అంటున్నారు సినీ లవర్స్. కానీ క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 47 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేటర్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం.

దానితోపాటు 32 కోట్ల రూపాయల షేర్ కూడా రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి హిట్ టాక్  వచ్చి ఉంటే అఖండ రేంజ్ లో సక్సెస్ సాధించేవారు అని కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ మంచి అవకాశాన్ని కాంబినేషన్ మిస్ చేసుకున్నారు.  దాదాపుగా  15 కోట్ల రూపాయలకు పైగా  ఈ సినిమాకి లాస్ వచ్చింది. అంటే స్కంద ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే స్కంద సినిమా డిజిటల్ రైట్స్ ని ఫాన్సీ రేటింగ్ కి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి వారు చాలా కాలం ముందే కొనుగోలు చేశారు. సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ చేయాలి అని

ముందుగా ఒప్పందం  కుదిరించుకున్నారు. కానీ ముందుగానే ఈ సినిమాని స్ట్రీమింగ్ చేసే అవకాశం ఇస్తే గనక ముందు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాము అని ఆఫర్ చేశారట. అందుకే ఇప్పుడు ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు అనుకున్న దానికంటే ముందుగానే విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 27 న  స్ట్రీమింగ్ కోసం స్కంద సినిమా రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. థియేటర్స్ లో పెద్దగా ఆదరణ దక్కించుకొని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో ఆడియన్స్ ని మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి. బోయపాటి శ్రీను సినిమాలు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని అందుకున్నా లేకపోయినా కూడా ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని అందుకుంటాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>