Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccebcbb1b1-3223-4ed9-91c1-f22f4745bebf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccebcbb1b1-3223-4ed9-91c1-f22f4745bebf-415x250-IndiaHerald.jpgభారత జట్టు 2023 వరల్డ్ కప్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది. సాధారణంగానే వరల్డ్ కప్ అంటే చాలు టీమ్ ఇండియా టైటిల్ ఫేవరెట్ టీమ్స్ లలో ఒకటిగా ఉంటుంది. అలాంటిది ఇక భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కావడంతో ఇక టీమ్ ఇండియా పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. పుష్కరకాలం తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను తప్పక గెలిచి తీరుతుంది అని 130 కోట్ల ప్రజానీకం మొత్తం ఆశలు పెట్టుకుంది. రోహిత్ భారత క్రికెట్ చరిత్రలో వరల్డ్ కప్ గెలIcc{#}Bangladesh;Mohammed Shami;World Cup;Cricket;Indiaబంగ్లాదేశ్ తో మ్యాచ్లో.. శార్దూల్ ఠాగూర్ కు బదులు అతను బెటర్?బంగ్లాదేశ్ తో మ్యాచ్లో.. శార్దూల్ ఠాగూర్ కు బదులు అతను బెటర్?Icc{#}Bangladesh;Mohammed Shami;World Cup;Cricket;IndiaThu, 19 Oct 2023 09:35:00 GMTభారత జట్టు 2023 వరల్డ్ కప్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది. సాధారణంగానే వరల్డ్ కప్ అంటే చాలు టీమ్ ఇండియా టైటిల్ ఫేవరెట్ టీమ్స్ లలో ఒకటిగా ఉంటుంది. అలాంటిది ఇక భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కావడంతో ఇక టీమ్ ఇండియా పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. పుష్కరకాలం తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను తప్పక గెలిచి తీరుతుంది అని 130 కోట్ల ప్రజానీకం మొత్తం ఆశలు పెట్టుకుంది. రోహిత్ భారత క్రికెట్ చరిత్రలో వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లలో ఒకడిగా చేరుతాడు అని అందరూ నమ్ముతున్నారు.



 ఇలాంటి సమయంలో అందరి అంచనాలను నిలబెడుతూ టీమ్ ఇండియావరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే  మిగతా జట్లతో పోల్చి చూస్తే అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా.. ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పుడు వరకు మూడు మ్యాచ్లు ఆడిన టీమిండియా మూడింటిలో కూడా విజయం సాధించడం గమనార్హం. ఇలా హ్యాట్రిక్ సాధించి జోరు మీద ఉన్న టీమ్ ఇండియా నేడు బంగ్లాదేశ్తో నాలుగో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే భారత జట్టు కూర్పు ఎలా ఉంటుంది అనే విషయంపై చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ యూసఫ్ పఠాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్లో భారత తుది జట్టులో సీనియర్ ఫేసెస్ మహమ్మద్ షమీ ఉండాలి అంటూ అభిప్రాయపడ్డాడు యూసుఫ్ పఠాన్. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహమ్మద్ షమీ ఆడితే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. షమీకి ఉన్న అనుభవం ఫామ్ టీమ్ ఇండియాకు ఎంతగానో కలిసి వస్తుంది అంటూ తెలిపాడు. మరి బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్ లో తుది జట్టులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>