SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wc-20234b059ed5-83a4-4669-b514-4b5fd27ad43f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/wc-20234b059ed5-83a4-4669-b514-4b5fd27ad43f-415x250-IndiaHerald.jpgవరల్డ్‌కప్‌-2023లో బంగ్లాదేశ్‌ టీంతో మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వన్డే ఫార్మాట్‌లో దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లి బాల్‌తో రంగంలోకి దిగాడు.వేసిన మూడు బంతుల్లో విరాట్ రెండు పరుగులు ఇచ్చాడు.అసలేం జరిగిందంటే.. పుణె వేదికగా టీమిండియాతో మ్యాచ్‌తో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ సందర్భంగా.. భారత జట్టు కెప్టెన్ రోహిత్‌ శర్మ.. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేతికి బంతినిచ్చాడు.ఈ క్రమWC 2023{#}Ravindra Jadeja;Athadu;Australia;Bangladesh;VIRAT KOHLIకోహ్లీ బౌలింగ్.. 1000 బాదేసిన బంగ్లాదేశ్ బ్యాటర్?కోహ్లీ బౌలింగ్.. 1000 బాదేసిన బంగ్లాదేశ్ బ్యాటర్?WC 2023{#}Ravindra Jadeja;Athadu;Australia;Bangladesh;VIRAT KOHLIThu, 19 Oct 2023 18:04:34 GMTవరల్డ్‌కప్‌-2023లో బంగ్లాదేశ్‌ టీంతో మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వన్డే ఫార్మాట్‌లో దాదాపు ఆరేళ్ల తర్వాత టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లి బాల్‌తో రంగంలోకి దిగాడు.వేసిన మూడు బంతుల్లో విరాట్ రెండు పరుగులు ఇచ్చాడు.అసలేం జరిగిందంటే.. పుణె వేదికగా టీమిండియాతో మ్యాచ్‌తో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ సందర్భంగా.. భారత జట్టు కెప్టెన్ రోహిత్‌ శర్మ.. పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేతికి బంతినిచ్చాడు.ఈ క్రమంలో పాండ్యా బౌలింగ్‌లో తొలి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన లిటన్‌ దాస్‌ మరుసటి రెండు బంతుల్లో వరుసగా రెండు ఫోర్లని బాదాడు. అయితే, రెండోసారి బౌండరీ దిశగా వెళ్తున్న బంతిని ఆపే క్రమంలో పాండ్యా తన కుడికాలిని అడ్డుపెట్టడం జరిగింది. ఇక ఈ క్రమంలో పట్టుతప్పి జారిపడిపోయాడు.


పాండ్యా నొప్పితో విలవిల్లాడటంతో.. ఓవర్‌ పూర్తి చేసేందుకు రోహిత్‌ శర్మ..విరాట్ కోహ్లిని పిలిచాడు. ఇక పాండ్యా ఓవర్లో మిగిలిన మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు  కోహ్లి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక వన్డేల్లో ఆఖరిసారిగా.. 2017లో శ్రీలంకతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి బౌలింగ్‌ చేశాడు.ఇక వన్డే ప్రపంచకప్‌ ఈవెంట్ల విషయానికొనిస్తే.. 2011 క్వార్టర్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా టీంతో(0/6 (1)), ఫైనల్లో శ్రీలంకతో(0/6 (1)).. ఇంకా అదే విధంగా 2015 సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో(0/7 (1)) మ్యాచ్‌లో విరాట్ కోహ్లి బంతితో రంగంలోకి దిగాడు. 


ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం అరుదైన ఘనతని సాధించాడు. ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీలో ఏకంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అందువల్ల వరల్డ్‌కప్‌ చరిత్రలో ఈ ఫీట్‌ నమోదు చేసిన రెండో బంగ్లా ఆటగాడిగా రహీం రికార్డు సృష్టించాడు. 27.4 ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్లో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌(66) అవుట్‌ కాగా.. ముష్ఫికర్‌ రహీం క్రీజులోకి వచ్చాడు.ఇక ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు 29.4 ఓవర్‌ వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రెండు పరుగులు తీశాడు.ఆ పరుగులతో ప్రపంచకప్‌ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ముష్ఫికర్‌ రహీం కంటే ముందు ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ బంగ్లాదేశ్‌ తరఫున ఈ ఘనత సాధించాడు. ఇప్పటి దాకా షకీబ్‌ వరల్డ్‌కప్‌ చరిత్రలో 1201 పరుగులు సాధించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>