MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5df5b511-cf43-4bc7-8109-b05121e60fd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5df5b511-cf43-4bc7-8109-b05121e60fd3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత. ఈ సందర్భంగా మహేష్ బాబు తనకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. విజయం ఒక్కసారిగా రాదు. వచ్చినా స్థిరంగా ఉండదు. శ్రమించి సాధించే విజయం చివరిదాకా ఉండిపోతుంది. దానికోసమే మనం కష్టపడాలి. సాహసాలను చేయాలి. అప్పుడు గాని అసలైన విజయం మనకు దక్కదు అని నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. tollywood{#}Guntur;mahesh babu;Rajani kanth;Manam;Tollywood;Father;Hyderabad;mediaనా సినిమాలు ఆడకపోతే చాలా ఫీల్ అవుతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు..!?నా సినిమాలు ఆడకపోతే చాలా ఫీల్ అవుతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు..!?tollywood{#}Guntur;mahesh babu;Rajani kanth;Manam;Tollywood;Father;Hyderabad;mediaThu, 19 Oct 2023 17:01:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత. ఈ సందర్భంగా మహేష్ బాబు తనకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. విజయం ఒక్కసారిగా రాదు. వచ్చినా స్థిరంగా ఉండదు. శ్రమించి సాధించే విజయం చివరిదాకా ఉండిపోతుంది. దానికోసమే మనం కష్టపడాలి. సాహసాలను చేయాలి. అప్పుడు గాని అసలైన విజయం మనకు దక్కదు అని నాన్నగారు

 ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నేను చేసిన సినిమాలు సరిగా ఆడనప్పుడు నాన్న చెప్పిన మాటలు నాకు చాలా బాగా గుర్తుకు వస్తూ ఉంటాయి.. అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు మహేష్ బాబు. అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ నేను చాలా సెన్సిటివ్ .. సినిమాలు ఆడకపోతే నిరుత్సాహానికి లోనవుతూ ఉంటాను.. అంతేకాదు అంచనాలు తలకిందులు అయితే కొన్నాళ్లపాటు ఆ ప్రభావం నాపై ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే ఆ సమయంలో ఫ్యామిలీతో  ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. కానీ ఈ విషయంలో నాన్నగారు

 పూర్తిగా డిఫరెంట్ గా ఉంటారు. ఆయన పరాజయాల గురించి అసలుగా పట్టించుకోరు. కనీసం ఆలోచించరు కూడా.. ఆయన చేసిన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా అలాగే వరస సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా నాన్నగారు ఎన్నో అద్భుతాలను సృష్టించారు అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు సూపర్స్టార్ మహేష్ బాబు. అలా ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>