MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4227263c-d446-4b72-89be-5ff9450ee679-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4227263c-d446-4b72-89be-5ff9450ee679-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా లియో. గత ఏడాది విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న ఈ యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ ఇప్పుడు లియో సినిమాతో కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకోవాలి అని ఆశిస్తున్నారు. తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుండగా లియో తెలుగు వర్షన్ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'ఖైదీ', 'విక్రమ్' వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు లోకేష్ tollywood{#}sithara;Dalapathi;vamsi;Hyderabad;naga;Kannada;Kollywood;vikram;Joseph Vijay;Industry;Tamil;producer;Producer;Lokesh;Lokesh Kanagaraj;Director;October;court;Chitram;Cinema;Audience;Telugu'లియో' తెలుగు టైటిల్ కోసం సితార నిర్మాత ఎన్ని లక్షలు ఖర్చు చేశారో తెలుసా..!?'లియో' తెలుగు టైటిల్ కోసం సితార నిర్మాత ఎన్ని లక్షలు ఖర్చు చేశారో తెలుసా..!?tollywood{#}sithara;Dalapathi;vamsi;Hyderabad;naga;Kannada;Kollywood;vikram;Joseph Vijay;Industry;Tamil;producer;Producer;Lokesh;Lokesh Kanagaraj;Director;October;court;Chitram;Cinema;Audience;TeluguThu, 19 Oct 2023 16:05:00 GMTకోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా లియో. గత ఏడాది విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న ఈ యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ ఇప్పుడు లియో సినిమాతో కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకోవాలి అని ఆశిస్తున్నారు. తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుండగా లియో తెలుగు వర్షన్ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'ఖైదీ', 'విక్రమ్' వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు లోకేష్ కనగరాజ్. అలాగే కోలీవుడ్ హీరో విజయ్ కి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో తెలుగులోనూ 'లియో' కి భారీగా బిజినెస్ జరిగింది.

ఈ చిత్ర తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. అయితే ఈ మూవీ తెలుగు వర్షన్ రిలీజ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ కి చివరి నిమిషంలో భారీ షాక్ తగిలింది. 'లియో' సినిమాని అదే టైటిల్ తో తెలుగులో విడుదల చేయడానికి వీలులేదని, ఆల్రెడీ తెలుగులో ఈ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నట్టుగా కోర్టులో కేసు వేయడంతో హైదరాబాద్ సివిల్ కోర్టు లియో తెలుగు వెర్షన్ రిలీజ్ పై స్టే విధించింది. దీంతో రంగంలోకి దిగిన నిర్మాత నాగ వంశీ టైటిల్ విషయంలో కేసు వేసిన వ్యక్తికి భారీ మొత్తం చెల్లించి టైటిల్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు 'లియో' తెలుగు టైటిల్ సెటిల్మెంట్ కోసం ఏకంగా రూ.26 లక్షలు చెల్లించి టైటిల్ ని

 తీసుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఫైనల్ గా టైటిల్ ఇష్యు సెటిల్ అవ్వడంతో తెలుగులో లియో రిలీజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. ఇందులో భాగంగానే ముందు అనుకున్న రిలీజ్ డేట్ అక్టోబర్ 19నే లియో తెలుగులో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 'లియో' మూవీకి రూ.454 కోట్ల బిజినెస్ జరిగింది. ఇందులో డిజిటల్ రైట్స్ రూ.140 కోట్ల కు అమ్ముడవడం విశేషం. తెలుగులో లియో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సితార నిర్మాత నాగ వంశీ ఏకంగా రూ.22 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఓ డబ్బింగ్ మూవీకి ఈ రేంజ్ లో ఖర్చు చేయడం అంటే మాములు విషయం కాదు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>