LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/banana-face-pack-using194e940f-e1df-423e-a98c-7e7a29c9887f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/banana-face-pack-using194e940f-e1df-423e-a98c-7e7a29c9887f-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్క మహిళకి తను అందంగా లక్ష్మీదేవి లాగా కనపడించాలని కోరిక కచ్చితంగా ఉంటుంది.అలా ముఖాన్ని మెరిపించడం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు చేసి,ముఖాన్ని మెరిపించుకుంటూ ఉంటారు.సాధారణ సమయంలో ఎలా ఉన్నా సరే,పండగలు ఫంక్షన్లు అంటే మాత్రం కచ్చితంగా బ్యూటీ పార్లర్ లో రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూవుంటారు.అలా అంతటి ఖర్చు భరించలేం అనే వారికి,మరియు కెమికల్ ప్రొడక్ట్స్ శరీరానికి పడని వారికి ఇంట్లో ఉన్న అరటిపండుతో నిముషాల్లో మెరిపించుకోవచ్చు అని చర్మం నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు.ఆ బ్యూటీBANANA FACE PACK;USING{#}Mixie;Coffee;Wanted;BEAUTYపండగ వేళ అరటిపండుతో మీ ముఖాన్ని మెరిపించండిలా..!పండగ వేళ అరటిపండుతో మీ ముఖాన్ని మెరిపించండిలా..!BANANA FACE PACK;USING{#}Mixie;Coffee;Wanted;BEAUTYThu, 19 Oct 2023 19:00:00 GMTప్రతి ఒక్క మహిళకి తను అందంగా లక్ష్మీదేవి లాగా కనపడించాలని కోరిక కచ్చితంగా ఉంటుంది.అలా ముఖాన్ని మెరిపించడం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు చేసి,ముఖాన్ని మెరిపించుకుంటూ ఉంటారు.సాధారణ సమయంలో ఎలా ఉన్నా సరే,పండగలు ఫంక్షన్లు అంటే మాత్రం కచ్చితంగా బ్యూటీ పార్లర్ లో రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూవుంటారు.అలా అంతటి ఖర్చు భరించలేం అనే వారికి,మరియు కెమికల్ ప్రొడక్ట్స్ శరీరానికి పడని వారికి ఇంట్లో ఉన్న అరటిపండుతో నిముషాల్లో మెరిపించుకోవచ్చు అని చర్మం నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు.ఆ బ్యూటీ టిప్ ఏంటో మనము చూద్దాం పదండి..

దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన ఒక అరటిపండును ముక్కలు ముక్కలుగా చేసి వేసుకోవాలి.అదే మిక్సీ గిన్నెలోనే ఒక స్ఫూన్ పాలు, బియ్యం పిండి,అర టీ స్పూన్ కాఫీ పౌడర్,ఒక స్పూన్ తేనె వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి.ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని శుభ్రంగా ఉన్న ముఖముపై అప్లై చేసి అరగంట సేపు ఆరనివ్వాలి.ఆ తరువాత ఒక టమోటాను సగంగా కట్ చేసి,ఆ ముక్కతో మెల్లగా మర్దన చేసి,గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడైనా ఫంక్షన్లకు కానీ పండగలు కానీ వేలకు వేలు తగలెయ్యకుండా, ఇలా నిమిషాల్లో ముఖాన్ని మెరూపించుకోవచ్చు.

ఇందులో వాడిన బియ్యం పిండి మరియు కాఫీ పౌడర్ లు ముఖంపై మృత కణాలను తొలగిస్తాయి.అంతే కాక అన్ వాంటెడ్ హెయిర్ ని కూడా సమూలంగా నాశనం చేస్తాయి.మరియు అరటిపండు,తేనే ముఖానికి మాయిశ్చరైజేషన్ ని అందించడమే కాక,ముఖం బంగారంలా మెరిసేందుకు కూడా చాలా బాగా తోడ్పడుతుంది.తేనే చర్మంపై ఉన్న  బ్రేకౌట్స్ ని,మొటిమలు,మచ్చలను తొలగించడంలో తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇలా ఇందులో వాడిన ప్రతి పదార్థము నాచురల్ గా మన ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.మీరు కూడా ఇలాంటి మెరుపుదనాన్ని పొందాలి అంటే ఈ చిట్కా తప్పనిసరిగా వాడండి.అంతేకాక సరేనా నిద్ర,సరైన ఆహారం,సరైన మోతాదులో నీరు తీసుకోవడం,సరియైన జీవనశైలి, వంటివి అలవర్చుకోవడం చాలా ఉత్తమం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>