MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/government-employee3c6c947b-72fb-4b53-a4bc-aeb1f919bc68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/government-employee3c6c947b-72fb-4b53-a4bc-aeb1f919bc68-415x250-IndiaHerald.jpgప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. గ్రూప్ సి , గ్రూప్ డి, గ్రూప్ బి లోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీపావళి బోనస్ కింద కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునరుద్ధరించింది. ఇకపోతే దీపావళికి ముందే కేంద్రం తన ఉద్యోగులకు బోనస్ ను ప్రకటించడంతో ఉద్యోగులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పారా మిలిటరీ సాయుధ భలగాలకు చెందిన అర్హులైన ఉద్యోగులకు కూడా ఈ బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.GOVERNMENT EMPLOYEE{#}2020;Drought;March;festival;Diwali;wednesday;central government;september;tuesday;SantoshamMoney: ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం..!Money: ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్ర ప్రభుత్వం..!GOVERNMENT EMPLOYEE{#}2020;Drought;March;festival;Diwali;wednesday;central government;september;tuesday;SantoshamWed, 18 Oct 2023 11:00:00 GMTప్రభుత్వ ఉద్యోగులకు తాజాగా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. గ్రూప్ సి , గ్రూప్ డి, గ్రూప్ బి లోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీపావళి బోనస్ కింద కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునరుద్ధరించింది. ఇకపోతే దీపావళికి ముందే కేంద్రం తన ఉద్యోగులకు బోనస్ ను ప్రకటించడంతో ఉద్యోగులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పారా మిలిటరీ సాయుధ భలగాలకు చెందిన అర్హులైన ఉద్యోగులకు కూడా ఈ బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఇకపోతే ఈ ఆర్డర్ల కింద బోనస్ చెల్లింపు గరిష్ట పరిమితి రూ .7వేల నెలవారీ జీతం అని కూడా తెలిపింది. 2021 మార్చి 31వ తేదీ నాటికి సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో కనీసం 6 నెలల పాటు నిరంతర సేవలను అందించిన ఉద్యోగులకు ఈ తాత్కాలిక బోనస్ లభిస్తుందని వారు మాత్రమే అర్హులని కూడా కేంద్రం వెల్లడించింది. ఇకపోతే ఇందులో పారా మిలిటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, గ్రూప్ బి ర్యాంక్ అధికారులకు గరిష్ట పరిమితి రూ.7వేలతో దీపావళి బోనస్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మరొకవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ లో నాలుగు శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇక బుధవారం జరిగే భేటీ తర్వాత అసలు నిర్ణయం వెలువడే అవకాశం ఉందట.

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని ప్రస్తుతం 42 శాతం నుంచి 46 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే 69.76 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇదే సంవత్సరం మార్చిలో కేంద్ర మంత్రివర్గం కరువు భత్యం , డియర్ నెస్ రిలీఫ్లను నాలుగు శాతం పెంచింది. గత ఏడాది సెప్టెంబర్ లో దీపావళికి కొన్ని వారాల ముందు  అదనపు డీ ఏ ని నాలుగు శాతం పెంచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ నిర్ణయం చాలా మందికి ఊరట కలిగిస్తోందని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>