Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle88d5e3b4-b83f-4186-a257-18c307418d0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle88d5e3b4-b83f-4186-a257-18c307418d0f-415x250-IndiaHerald.jpgతెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్ స్థానం లో ఉన్న ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోలలో ఒకడు మోహన్ బాబు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆయన చేసిన పాత్రలకు, సాధించిన విజయాలకు ఆ స్థానం సముచితమైనదే. కానీ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వయస్సు అయ్యాక ఫేడ్ అవుట్ అవ్వడం అనేది సర్వసాధారణం. అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్స్ కి కూడా ఇది తప్పలేదు. అలా మోహన్ బాబు కి హీరో గా మార్కెట్ పోయి రెండు దశాబ్దాలు అయ్యింది.అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన పట్టువదలకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇద్దరు కొడుకులు ఇండస్ట్రsocialstars lifestyle{#}Amitabh Bachchan;editor mohan;manchu vishnu;mohan babu;nayantara;vishnu;lord siva;vegetable market;Film Nagar;Legend;Chitram;Nijam;Kumaar;Industry;Prabhas;Shiva;Chiranjeevi;Success;Hero;Cinemaఆ విషయంలో కలెక్షన్ కింగ్ ను లెక్కచేయని మెగాస్టార్....!!ఆ విషయంలో కలెక్షన్ కింగ్ ను లెక్కచేయని మెగాస్టార్....!!socialstars lifestyle{#}Amitabh Bachchan;editor mohan;manchu vishnu;mohan babu;nayantara;vishnu;lord siva;vegetable market;Film Nagar;Legend;Chitram;Nijam;Kumaar;Industry;Prabhas;Shiva;Chiranjeevi;Success;Hero;CinemaWed, 18 Oct 2023 21:44:00 GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్ స్థానం లో ఉన్న ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోలలో ఒకడు మోహన్ బాబు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఆయన చేసిన పాత్రలకు, సాధించిన విజయాలకు ఆ స్థానం సముచితమైనదే. కానీ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వయస్సు అయ్యాక ఫేడ్ అవుట్ అవ్వడం అనేది సర్వసాధారణం. అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్స్ కి కూడా ఇది తప్పలేదు. అలా మోహన్ బాబు కి హీరో గా మార్కెట్ పోయి రెండు దశాబ్దాలు అయ్యింది.అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన పట్టువదలకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అయ్యింది, పలు హిట్స్ కూడా కొట్టారు, కానీ తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఇది నిజంగా శోచించాల్సిన విషయం.రీసెంట్ సంవత్సరాలలో మంచు మోహన్ బాబు హీరో గా నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' అలాగే ఆయన పెద్ద తనయుడు మంచు విష్ణు హీరో గా నటించిన 'జిన్నా' చిత్రాలకు సున్నా షేర్స్ వచ్చాయి.

ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లో దిగ్గజం గా కొనసాగుతూన్న మోహన్ బాబు కి ఇలా ఇద్దరు కొడుకుల్ని సక్సెస్ చెయ్యలేకపోయానే అనే బాధ మనసులో ఉండేది. అయితే చివరి ప్రయత్నం లో భాగంగా ఆయన తన కొడుకు ని పెట్టి 'కన్నప్ప' అనే చిత్రాన్ని డ్రీం ప్రాజెక్ట్ గా తీసుకొని , 100 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం లో మరింత వెయిట్ పెరిగేందుకు ప్రభాస్, నయనతార , మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ఇలా ఎంతో మంది సూపర్ స్టార్స్ ని ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు పోషించేలా ఒప్పించాడు.   ప్రభాస్ మరియు నయనతార ఈ చిత్రం లో శివ పార్వతులుగా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి ని సంప్రదించాడట మోహన్ బాబు. కానీ చిరంజీవి కుదరదు బాబు, డేట్స్ లేవు ఏమి అనుకోకు అని చెప్పాడట. దీనికి మోహన్ బాబు చాలా హర్ట్ అయ్యినట్టు సమాచారం. గత ఏడాది మా ఎన్నికలలో చిరంజీవి మరియు మోహన్ బాబు మధ్య మాట మాట పెరిగి గొడవలైన సంగతి మన అందరికీ తెలిసిందే.మంచు విష్ణు ప్రత్యక్షంగా చిరంజీవి పై విమర్శలు కూడా చేసాడు. ఇదంతా చిరంజీవి మర్చిపోలేదని, అందుకే కావాలని ఇలా మోహన్ బాబు రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసాడు అంటూ ఫిలిం నగర్ లో బలంగా వినిపిస్తున్న టాక్. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>