EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdpe5b4b4d6-05eb-45b6-bd89-eccce494a1ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdpe5b4b4d6-05eb-45b6-bd89-eccce494a1ce-415x250-IndiaHerald.jpgఉమ్మడి ఏపీలో ఒకప్పుడు తెలుగుదేశానికి తిరుగులేదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏపీకే పరిమితం కావడంతో తెలంగాణలో పార్టీని పట్టించుకునే వారే కరవయ్యారు. పార్టీ పరిస్థితులపై సమీక్షలు నిర్వహించడమే మానేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకున్నారు. కొంతమంది కార్యకర్తలు మాత్రం అలానే ఉండిపోయారు. తాజాగా తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుని కలసి మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను పోtdp{#}Kamma;Hindupuram;Rajahmundry;Nara Bhuvaneshwari;Telugu Desam Party;TDP;Backward Classes;CBN;Congress;CM;Telangana;Party;Balakrishna;Teluguతెలంగాణ తెలుగుదేశాన్ని పూర్తిగా గాలికి వదిలేశారా?తెలంగాణ తెలుగుదేశాన్ని పూర్తిగా గాలికి వదిలేశారా?tdp{#}Kamma;Hindupuram;Rajahmundry;Nara Bhuvaneshwari;Telugu Desam Party;TDP;Backward Classes;CBN;Congress;CM;Telangana;Party;Balakrishna;TeluguWed, 18 Oct 2023 10:00:00 GMTఉమ్మడి ఏపీలో ఒకప్పుడు తెలుగుదేశానికి తిరుగులేదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏపీకే పరిమితం కావడంతో తెలంగాణలో పార్టీని పట్టించుకునే వారే కరవయ్యారు. పార్టీ పరిస్థితులపై సమీక్షలు నిర్వహించడమే మానేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకున్నారు.  కొంతమంది కార్యకర్తలు మాత్రం అలానే ఉండిపోయారు.


తాజాగా తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుని కలసి మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించుతున్నట్లు ప్రకటించారు. జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలా లేదా అనేది త్వరలో తెలుస్తుంది. మేనిఫెస్టో కూడా విడుదల చేస్తాం. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణ అంతటా ప్రచారం నిర్వహిస్తారు అని చెప్పారు. ఇదే సందర్భంలో బక్కని నర్సింహులకు నారా భువనేశ్వరి నుంచి పిలుపు వచ్చింది. హుటాహుటిన ఆయన రాజమండ్రికి వెళ్లారు.


టీడీపీని అభిమానించే వారెవరు మరో పార్టీని ఆదరించలేరు ఇది ఆ పార్టీ బలం. కాకపోతే కమ్మ సామాజిక వర్గానికి పార్టీలో ఇచ్చే ప్రధాన్యం ఇతరులకు ఇవ్వరు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. గతంలో బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ను  సీఎం అభ్యర్థిగా ప్రకటించినా అందుకు తగిన సహకారం మాత్రం ఆయనకు లభించలేదు. ఇప్పుడు  మరో బీసీ నేత కాసాని జ్ణానేశ్వర్ పరిస్థితి కూడా అంతే.


మరోవైపు తెలుగుదేశం సత్తా చూపాలని చెబుతూ కాంగ్రెస్ ను గెలిపించాలని అంతర్గతంగా పిలుపునిస్తున్నారు. టీడీపీ సొంతంగా నిలబడాలనే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఒక 10-20 పార్టీ బలమైన సీట్లు ఎంచుకొని వాటిలో పక్కాగా ప్రణాళికలు రచించి గెలిచేందుకు కృషి చేస్తే ఒకవేళ హంగ్ ఏర్పడితే తామే కీలకపాత్ర పోషించవచ్చు అనే ఆలోచనే చేయడం లేదు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించకపోవడం ఒక మైనస్ అయితే బీసీలకు విలువ ఇవ్వకపోవడం ఆ పార్టీకి ప్రతికూలాంశం. చివరకు ఎన్నికల బరిలో ఉంటారా లేదో కూడా చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>