MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgబాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ పరిస్థితి అయోమయంగా మారిపోతోంది. ఒకవైపు షారూఖ్ ఖాన్ వరసపెట్టి తన సినిమాలను 1000 కోట్ల సినిమాలుగా రికార్డులు క్రియేట్ చేస్తూ పరుగులు తీస్తూ ఉంటే సల్మాన్ మాత్రం వరస పరాజయాలతో సతమతమై పోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చేనెల దీపావళి ని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘టైగర్ 3’ ఘనవిజయం అతడి కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. అయితే లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మిశ్రమ స్పందన రావడమే కాకుండా ఆ ట్రైలర్ పై వస్తున్న సెటైర్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీసిన నsalmankhan{#}John Abraham;Diwali;Yash;Salman Khan;Heroine;Hero;News;Cinemaసల్మాన్ ఖాన్ ను కలవర పెడుతున్న సెటైర్లు !సల్మాన్ ఖాన్ ను కలవర పెడుతున్న సెటైర్లు !salmankhan{#}John Abraham;Diwali;Yash;Salman Khan;Heroine;Hero;News;CinemaWed, 18 Oct 2023 09:00:00 GMTబాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ పరిస్థితి అయోమయంగా మారిపోతోంది. ఒకవైపు షారూఖ్ ఖాన్ వరసపెట్టి తన సినిమాలను 1000 కోట్ల సినిమాలుగా రికార్డులు క్రియేట్ చేస్తూ పరుగులు తీస్తూ ఉంటే సల్మాన్ మాత్రం వరస పరాజయాలతో సతమతమై పోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చేనెల దీపావళి ని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘టైగర్ 3’ ఘనవిజయం అతడి కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది.



అయితే లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మిశ్రమ స్పందన రావడమే కాకుండా ఆ ట్రైలర్ పై వస్తున్న సెటైర్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీసిన నిర్మాతలకు కలవరపాటుకు గురి చేస్తున్నట్లు టాక్. ఈ మూవీ నిర్మాతలు యష్ రాజ్ ఫిలిమ్స్ ‘స్పై’ మూవీ కథను తిప్పితిప్పి మళ్ళీ సీక్వెల్స్ గా తీసి బోర్ కొట్టిస్తున్నారని సగటు సినిమా ప్రేక్షకులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



‘పఠాన్’ లో జాన్ అబ్రహం పాత్రను ‘టైగర్ 3’ లో ఇమ్రాన్ హష్మీగా మార్చారా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. దేశద్రోహం కేసు మీద హీరో అవమానాల పాలు కావడం ఎప్పుడో దేవానంద్ నటించిన ‘జమానా’ నుంచి ‘జవాన్’ వరకు ఇలాంటి పాత కథలు చాల వచ్చాయి కదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే యాక్షన్ విజువల్స్ పరంగా భారీతనం కనిపిస్తున్నప్పటికీ కథలో కొత్త దనం కనిపించడం లేడు అంటూ ఈ ట్రైలర్ పై మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.  



హీరోయిన్ కత్రినా కైఫ్ విలన్ విలన్స్ తో టవల్ చుట్టుకుని చేసిన ఫైట్ లాంటి సీన్స్ చాల సినిమాలలో వచ్చాయి కదా అంటూ మరికొందరి అభిప్రాయం. ఇక ఈ ట్రైలర్ చూసిన వారు ఈమూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయం పై కూడ పెదవి విరుస్తున్నారు. లేటెస్ట్ గా విడులైన ‘జవాన్’ మూవీ కథ ఛాయలు ‘టైగర్ 3’ లో కనిపించే ఆస్కారం ఉంది అంటూ మరికొందరి అభిప్రాయం.. రాబోతున్న  దీపావళి  సల్మాన్ ఖాన్  కు రాబోతున్న  దీపావళి  ఎలాంటి  ఫలితాన్ని  అంధిస్తుందో   చూడాలి 






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>