MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/leo-moviea9cfa895-4735-4d9a-938a-3ea62d2e5ac2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/leo-moviea9cfa895-4735-4d9a-938a-3ea62d2e5ac2-415x250-IndiaHerald.jpgలోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'లియో'. విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, మాస్టర్ మూవీ తర్వాత విజయ్ - లోకేష్ కాంబినేషన్లో రెండో సినిమాగా 'లియో' వస్తుండటంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లియో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే అరుదైన ఘనత సాధించింది. తాజాLeo Movie{#}Cinema Tickets;Master;Blockbuster hit;Lokesh;Lokesh Kanagaraj;American Samoa;vikram;Joseph Vijay;Chitram;Indian;Tamil;India;Cinema'ఆర్ ఆర్ ఆర్' తర్వాత ఆ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ మూవీగా 'లియో'!'ఆర్ ఆర్ ఆర్' తర్వాత ఆ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ మూవీగా 'లియో'!Leo Movie{#}Cinema Tickets;Master;Blockbuster hit;Lokesh;Lokesh Kanagaraj;American Samoa;vikram;Joseph Vijay;Chitram;Indian;Tamil;India;CinemaWed, 18 Oct 2023 09:01:35 GMTలోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'లియో'. విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, మాస్టర్ మూవీ తర్వాత విజయ్ - లోకేష్ కాంబినేషన్లో రెండో సినిమాగా 'లియో' వస్తుండటంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లియో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే అరుదైన ఘనత సాధించింది. తాజాగా ఈ మూవీ రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. 

అడ్వాన్స్ బుకింగ్స్ లో 'లియో' మరింత ముందుకు దూసుకెళ్తోంది. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ దగ్గర 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన రెండవ ఇండియన్ మూవీ గా 'లియో' నిలిచింది. లియో మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్ దాటడం గమనార్హం. గత ఏడాది విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కూడా రిలీజ్ కి ముందు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత విజయ్ నటించిన 'లియో' ఆ ఘనతను సాధించింది. ఈ రికార్డు తో ఓవర్సీస్ లో 'లియో' పై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

కేవలం అమెరికాలోనే కాదు వరల్డ్ వైడ్ గా 'లియో' ఓపెనింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల క్రిందటే అమెరికాలో లియో టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మొదటి నుంచి టికెట్ సేల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కి ముందు అత్యధిక అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన ఇండియన్ సినిమాగా లియో రికార్డు క్రియేట్ చేసింది. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా లియో తొలిరోజే 110 కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియా వైడ్ గా ఈ మూవీ ఓపెనింగ్స్ సుమారు 60 కోట్లకు పైగా మిగతా ప్రపంచ దేశంలో 50 కోట్లు గా ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన రజనీకాంత్ 2.0 రికార్డు బ్రేక్ చేసి అత్యధిక ఓపెనింగ్ సాధించిన తమిళ సినిమాగా నిలిచే దిశగా లియో దూసుకెళ్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>