HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health0fbe11ea-598e-41ef-8904-714baffedee3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health0fbe11ea-598e-41ef-8904-714baffedee3-415x250-IndiaHerald.jpgఈ ప్రకృతిలో అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లలో ఖచ్చితంగా తమలపాకు మొక్క కూడా ఒకటి. తమలపాకు ఆకులు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మొక్కలల్లో తమలపాకు మొక్క కూడా ఒకటి. ఈ తమలపాకుతో ఎక్కువగా కిల్లీని తయారు చేస్తూ ఉంటారు.కొందరు అయితే నేరుగా నములుతూ ఉంటారు.ఇంకా వీటితో పాటు తమలపాకుతో మనం ఎంతో రుచిగా ఉండే రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు.తమలపాకుతో చేసే ఈ రసం చాలా రుచిగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్తి, కడుపు ఉబ్బHealth{#}prakruti;Rasam;Turmeric;oil;garlic;cumin;salt;Betel;Dried Red Chillies;Gas Stove;Coriander.;Hing;Pepper Powder;Curry leaves;Manamఈ రసంతో భోజనం చేస్తే అంతులేని ఆరోగ్యం ఖాయం?ఈ రసంతో భోజనం చేస్తే అంతులేని ఆరోగ్యం ఖాయం?Health{#}prakruti;Rasam;Turmeric;oil;garlic;cumin;salt;Betel;Dried Red Chillies;Gas Stove;Coriander.;Hing;Pepper Powder;Curry leaves;ManamWed, 18 Oct 2023 17:38:00 GMTఈ ప్రకృతిలో అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లలో ఖచ్చితంగా తమలపాకు మొక్క కూడా ఒకటి. తమలపాకు ఆకులు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మొక్కలల్లో తమలపాకు మొక్క కూడా ఒకటి. ఈ తమలపాకుతో ఎక్కువగా కిల్లీని తయారు చేస్తూ ఉంటారు.కొందరు అయితే నేరుగా నములుతూ ఉంటారు.ఇంకా వీటితో పాటు తమలపాకుతో మనం ఎంతో రుచిగా ఉండే రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు.తమలపాకుతో చేసే ఈ రసం చాలా రుచిగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం ఇంకా శరీరంలో నలతగా ఉన్నప్పుడు ఇలా తమలపాకుతో రసాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ రసాన్ని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేసే ఈ తమలపాకు రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


తమలపాకు రసం తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..తమలపాకులు  7 నుండి 8, నాటు టమాటాలు  3, తరిగిన కొత్తిమీర  గుప్పెడు, ఉప్పు  తగినంత, రసం పొడి ఒక టేబుల్ స్పూన్, నీళ్లు 600 ఎమ్ ఎల్, పసుపు  అర టీ స్పూన్, మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు రెండు రెమ్మలు తీసుకోవాలి.


తాళింపు తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..నూనె  2 టేబుల్ స్పూన్స్, ఆవాలు  ఒక టీ స్పూన్, జీలకర్ర అర టీ స్పూన్, ఇంగువ  చిటికెడు, ఎండుమిర్చి 4, వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకోవాలి.తమలపాకు రసం తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు జార్ లో తమలపాకులను ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఆ తరువాత ఇందులోనే టమాట ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలపాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 12 నుండి 15 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలను కూడా ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. ఆ తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని రసంలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇక ఈ రసాన్ని వేడి వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ రసాన్ని వేడి వేడిగా అన్నంతో తింటే చక్కటి ఉపశమనం కలుగుతుంది.అలాగే ఎలాంటి ప్రమాదకర వ్యాధులు దరి చేరవు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>