Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/divorce-8b77048d-1f5a-422a-a153-a5f548ee9449-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/divorce-8b77048d-1f5a-422a-a153-a5f548ee9449-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో పెళ్లిళ్లు కొన్ని రోజులకే పెటాకులుగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎంతో ఘనంగా తల్లిదండ్రులకు భారీ కఠిన కానుకలు ముట్టజెప్పి పెళ్లిళ్లు చేస్తూ ఉంటే ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలకే మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. దీంతో ఇక విడాకులు తీసుకుని వేరు పడేందుకు ఎంతోమంది సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. దీంతో ఫామిలీ కోర్టులో ఇలా విడాకులకు సంబంధించిన కేసులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయని చెప్పాలి. అయితే ఇలా పెళ్లి చేసి పంపించిన కూతురు విడాకులు తీసుకుంటాను అని తండ్రితో చెబితే.. పెళ్ళDivorce {#}prem;Sakshi;Kumaar;Jharkhand;marriage;Fatherవిడాకులు తీసుకున్న కూతురుని.. ఊరేగిస్తూ ఇంటికి తీసుకొచ్చిన తండ్రి?విడాకులు తీసుకున్న కూతురుని.. ఊరేగిస్తూ ఇంటికి తీసుకొచ్చిన తండ్రి?Divorce {#}prem;Sakshi;Kumaar;Jharkhand;marriage;FatherWed, 18 Oct 2023 14:30:00 GMTఇటీవల కాలంలో పెళ్లిళ్లు కొన్ని రోజులకే పెటాకులుగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎంతో ఘనంగా తల్లిదండ్రులకు భారీ కఠిన కానుకలు ముట్టజెప్పి పెళ్లిళ్లు చేస్తూ ఉంటే ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలకే మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. దీంతో ఇక విడాకులు తీసుకుని వేరు పడేందుకు ఎంతోమంది సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. దీంతో ఫామిలీ కోర్టులో ఇలా విడాకులకు సంబంధించిన కేసులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయని చెప్పాలి. అయితే ఇలా పెళ్లి చేసి పంపించిన కూతురు విడాకులు తీసుకుంటాను అని తండ్రితో చెబితే.. పెళ్ళి అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు రావడం సహజం.



 ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోయి జీవించాలి. ఇక ఒక్కసారి మూడుముళ్ల బంధం ఏర్పడిన తర్వాత చచ్చే వరకు మెట్టినింట్లోనే ఉండాలి. చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటే నీ జీవితమే నాశనం అవుతుంది అని కూతురికి సర్ది చెప్పి ఇక అల్లుడుతో మాట్లాడి మళ్ళీ అత్తారింట్లో కూతురిని పంపించడం చేస్తూ ఉంటాడు తండ్రి. కానీ ఇక్కడ ఒక తండ్రి మాత్రం ఏకంగా కూతురు విడాకులు తీసుకుంటే మేళ తాళాలు, బాణా సంచావు ఊరేగింపు మధ్య ఘనంగా కూతురిని ఇంటికి తీసుకువచ్చాడు. ఈ అరుదైన ఘటన ఝార్ఖండ్ లోని రాంచీలో వెలుగులోకి వచ్చింది.


 ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి గత ఏడాది ఏప్రిల్ లో తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిపించాడు. ఇలా వివాహం చేసే సమయంలో భారీగానే కట్నకానుకలు కూడా ముట్ట చెప్పాడు. అయితే పెళ్లి అయిన కొన్నాళ్ల వరకు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత మాత్రం సాక్షి గుప్తాకు వేధింపులు మొదలయ్యాయి. ఇక సచిన్ కుమార్ కు అంతకంటే ముందే మరో వివాహం అయినట్లు ప్రేమ్ గుప్తాకు కూడా తెలిసింది. అయినప్పటికీ భర్తతో జీవితాన్ని కొనసాగించాలని సాక్షి గుప్తా ముందుగా అనుకుంది. కానీ వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవడంతో ఇక అతనితో ఉండడం సాధ్యం కాదు అని నిర్ణయించుకుంది సాక్షి. విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఆమె నిర్ణయాన్ని సాక్షి తండ్రి, కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. ఈ క్రమంలోనే విడాకులు మంజూరు చేసుకున్న ఆమెను మెట్టినింటి నుంచి పుట్టినింటికి మేళతాళాలు మధ్య టపాసులు కలుస్తూ ఘనంగా ఊరేగిస్తూ ఇంటికి తీసుకొచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>