ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral5519b1e1-7582-4642-90f8-ad739e75f636-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral5519b1e1-7582-4642-90f8-ad739e75f636-415x250-IndiaHerald.jpgబైక్ ప్రయాణం కొంతవరకు బాగున్నా కానీ ఎక్కువ సేపు చేస్తే నరకం కనపడుతుంది. ఒక 50 కిలోమీటర్లు వెళ్తే అల్లాడిపోవటం ఖాయం. అలాంటిది వంద కాదు.. వెయ్యి కాదు ఏకంగా లక్షా 40 వేల కిలో మీటర్ల దూరం బైక్‌పై ప్రయాణం చేశాడు ఓ వ్యక్తి.అవును మీరు విన్నది నిజమే.ఇక ఆ యువకుడు బైక్ పై చేసిన ప్రయాణం అనేది గిన్నిస్ బుక్ రికార్డ్ కోసమో సరదా కోసమో కాదు మానవ జన్మ అత్యుత్తమమని నిరూపించడానికి.. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని నిలబడి.. జీవితాన్ని నిండు నూరేళ్లు ఆస్వాదించాలని చాటి చెప్పడమే అతని ఉద్దేశమట. ఒత్తిడి తట్టుకోలేViral{#}Karthik;jeevitha rajaseskhar;sujatha;Nellore;February;central government;Bike;American Samoa;Yatra;Parents;Octoberలక్షా 40 వేల కి.మి బైక్ ప్రయాణం చేసిన యువకుడు?లక్షా 40 వేల కి.మి బైక్ ప్రయాణం చేసిన యువకుడు?Viral{#}Karthik;jeevitha rajaseskhar;sujatha;Nellore;February;central government;Bike;American Samoa;Yatra;Parents;OctoberTue, 17 Oct 2023 22:45:00 GMTబైక్ ప్రయాణం కొంతవరకు బాగున్నా కానీ ఎక్కువ సేపు చేస్తే నరకం కనపడుతుంది. ఒక 50 కిలోమీటర్లు వెళ్తే అల్లాడిపోవటం ఖాయం. అలాంటిది వంద కాదు.. వెయ్యి కాదు ఏకంగా లక్షా 40 వేల కిలో మీటర్ల దూరం బైక్‌పై ప్రయాణం చేశాడు ఓ వ్యక్తి.అవును మీరు విన్నది నిజమే.ఇక ఆ యువకుడు బైక్ పై చేసిన ప్రయాణం అనేది గిన్నిస్ బుక్ రికార్డ్ కోసమో సరదా కోసమో కాదు మానవ జన్మ అత్యుత్తమమని నిరూపించడానికి.. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని నిలబడి.. జీవితాన్ని నిండు నూరేళ్లు ఆస్వాదించాలని చాటి చెప్పడమే అతని ఉద్దేశమట. ఒత్తిడి తట్టుకోలేక జీవితాన్ని సగంలో ముగించాలి అనుకునే వారికి జీవిత సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నెల్లూరు కి చెందిన తూపిలి వెంకట కార్తీక్ అనే యువకుడు.తన జీవితంలో తాను ఎదురుకొన్న ఒత్తిడి మరొకరికి ఉండకూడదని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వెంకట కార్తీక్. ఇక నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్ పేటకు చెందిన తూపిలి వెంకట కార్తీక్ బీటెక్ పూర్తి చేశాడు.


అతను సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.ఇక అతను పడిన ఒత్తిడి గురించి తన తల్లిదండ్రులు మల్లికార్జున్ రావు, సుజాత లకు వివరించాడు. అంతేకాదు ప్రతి ఒక్క ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉందని తెలుసుకున్న కార్తీక్ ఇక అందరికీ అవగాహన కల్పించాలన్న సంకల్పంతో దేశవ్యాప్తంగా బైక్ యాత్రని ప్రారంభించాడు కార్తీక్. నెల్లూరు నుంచి గత సంవత్సరం ఫిబ్రవరి 14 న మొదలైన కార్తీక్ బైక్ యాత్ర 28 రాష్ట్రాలు ఇంకా 8 కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుతూ లక్షా 40 వేల కిలోమీటర్లు ప్రయాణించి.. అక్టోబర్ 6 న తిరిగి నెల్లూరుకు చేరుకున్నాడు. తన యాత్ర పూర్తి చేసుకుని నెల్లూరు కి వచ్చిన కార్తీక్ కి కుటుంబ సభ్యులు ఇంకా స్నేహితులు ఘన స్వాగతం పలికారు. అయితే ఇప్పటి దాకా లక్షా 39 వేల కిలో మీటర్ల బైక్ యాత్ర రికార్డ్ అమెరికా దేశానికి చెందిన యువతి పేరిట ఉంది.అయితే కార్తీక్ తాను ఇప్పటికే లక్షా 40 వేల కిలోమీటర్ల దూరం బైక్ యాత్ర చేశానని తన ప్రయాణ వివరాలను గిన్నిస్ బుక్ ప్రతినిధులకు ఇవ్వడం జరిగిందన్నారు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>