EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu79a6f630-5c66-4fd5-9a64-19b4883c946b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu79a6f630-5c66-4fd5-9a64-19b4883c946b-415x250-IndiaHerald.jpgవయస్సు అనేది కేవలం ఓ సంఖ్యే అని తన ఆరోగ్యానికి ఢోకా లేదని పలుమార్లు చంద్రబాబు స్వయంగా తెలిపారు. చర్మ సంబంధిత సమస్యలు మొదటి నుంచి ఉన్నా పార్టీ కోసం నిత్యం జనంలో తిరుగతూ.. ఎండల్లో ర్యాలీలు టీడీపీ కోసం కష్టపడుతుంటారు. ఏడు పదుల వయసులో ఆయనేం చేస్తాడు.. ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని వైసీపీ నేతలు విమర్శించే సందర్భంగా ఆయన పై తరహా వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన ఆరోగ్య సంబంధిత అంశాలపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. సరైన వ్యాయామం చేయక బరువు పెరిగారని.. జైలులో సరైనCHANDRABABU{#}mosquitos;Kathanam;CBN;TDP;YCP;Party;Shaktiజైల్లో అలా చేస్తే.. చంద్రబాబు ప్రాణాలకే ముప్పు?జైల్లో అలా చేస్తే.. చంద్రబాబు ప్రాణాలకే ముప్పు?CHANDRABABU{#}mosquitos;Kathanam;CBN;TDP;YCP;Party;ShaktiTue, 17 Oct 2023 10:00:00 GMTవయస్సు అనేది కేవలం ఓ సంఖ్యే అని తన ఆరోగ్యానికి ఢోకా లేదని పలుమార్లు చంద్రబాబు స్వయంగా తెలిపారు. చర్మ సంబంధిత సమస్యలు మొదటి నుంచి ఉన్నా పార్టీ కోసం నిత్యం జనంలో తిరుగతూ.. ఎండల్లో ర్యాలీలు టీడీపీ కోసం కష్టపడుతుంటారు. ఏడు పదుల వయసులో ఆయనేం చేస్తాడు.. ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని వైసీపీ నేతలు విమర్శించే సందర్భంగా ఆయన పై తరహా వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే  చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన ఆరోగ్య సంబంధిత అంశాలపై ఎక్కువగా చర్చ జరుగుతోంది.


సరైన వ్యాయామం చేయక బరువు పెరిగారని.. జైలులో సరైన సౌకర్యాలు లేక దోమలు ఎక్కువగా కుడుతున్నాయని తదితర అంశాల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనకు ఉన్న షుగర్, చర్మ సంబంధిత వ్యాధులు ప్రాణాంతకం అని చెబుతూ వస్తున్నారు.  దీనిపై ఓ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. మిగతా  వారితో పోల్చితే చంద్రబాబుకి  వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ అని.. ఇలాంటి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఓ ప్రముఖ వైద్యుడు తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. వీటితో పాటు చుట్టూ పరిసరాల ప్రభావం కూడా ఉంటుందని.. ఎక్కువగా గాలి, వెలుతురు, వేడి ఉంటే దాని ప్రభావం వ్యాధి నిరోధక శక్తి పై పడుతుందని ఫలితంగా కొత్త రోగాలు వస్తాయని పేర్కొన్నారు.  


వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ లు దాడి చేస్తాయి. ఆయన్ను పరీక్షించిన వైద్యులు సైతం ఇదే చెప్పారని తెలిపారు. ఇప్పటికే ఆయన ఆరోగ్య విషయంలో చాలా అశ్రద్ధ చేశారని…ఇది కేవలం శరీరంపై దద్దుర్లు సమస్యగా మాత్రమే చూడొద్దని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల పర్యవేక్షణ అవసరం అని పైపై మందులతో సరిపెడితే ప్రాణాపాయ స్థితికి చేరుతారని హెచ్చరించారు.  ఇప్పటికే నెల రోజులు దాటిందని.. ఇవే పరిస్థితులు కొనిసాగితే గుండె, మెదడుపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>