Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/smuggling-0dc26b0c-5814-41c5-ba8c-7363ed9751aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/smuggling-0dc26b0c-5814-41c5-ba8c-7363ed9751aa-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకానిక్ సార్ అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వరించింది అన్న విషయం తెలిసిందే అయితే పుష్ప సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా చూసి ఎంతోమంది అక్రమార్కులు బాగా ప్రభావితం అయ్యారు. పుష్ప సినిమాలో పోలీసులకు దొరకకుండా గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసిన Smuggling {#}mandalam;Driver;Cheque;marijuana;Hanamkonda;Master;Madhya Pradesh - Bhopal;Vishakapatnam;police;Allu Arjun;Blockbuster hit;Andhra Pradesh;Cinemaపుష్పను తలదన్నే స్మగ్లింగ్ సీన్.. గంజాయి ఎక్కడ దాచారో తెలుసా?పుష్పను తలదన్నే స్మగ్లింగ్ సీన్.. గంజాయి ఎక్కడ దాచారో తెలుసా?Smuggling {#}mandalam;Driver;Cheque;marijuana;Hanamkonda;Master;Madhya Pradesh - Bhopal;Vishakapatnam;police;Allu Arjun;Blockbuster hit;Andhra Pradesh;CinemaTue, 17 Oct 2023 18:32:00 GMTటాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకానిక్ సార్ అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వరించింది అన్న విషయం తెలిసిందే  అయితే పుష్ప సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా చూసి ఎంతోమంది అక్రమార్కులు బాగా ప్రభావితం అయ్యారు. పుష్ప సినిమాలో పోలీసులకు దొరకకుండా గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసిన విధానాన్ని రియల్ లైఫ్ లో కూడా ఫాలో అయ్యారు.


 ఈ క్రమంలోనే పుష్ప సినిమా విడుదలైన కొన్ని రోజులపాటు ఇక సినిమాల్లో ఉన్నలాంటి ఘటనలు బయట కూడా వెలుగులోకి వచ్చాయ్. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా పుష్ప సినిమాలోని సన్నివేశాలను సైతం తలదన్నే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా గంజాయి అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు భారీగానే ప్లాన్ చేశారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ లో వెలుగు చూసింది. ఏకంగా 300 కేజీల గంజాయిని  పోలీసులు పట్టుకోవడంతో అసలు కథ బయటపడింది.


 చూడ్డానికి అది ఖాళీ లారీ.. ఖాళీగా ఉన్న లారీలపై ఎవరికి అనుమానం రాదు. ఒకవేళ వస్తే క్యాబిన్లో డ్రైవర్ సీట్ కింద చెక్ చేసి పంపించేస్తారు పోలీసులు. స్మగ్లర్లు కూడా ఇలాగే అనుకున్నారు. ఈ క్రమంలోనే లారీపైన పరదా కట్టి ఆ పరదాలో గంజాయి ప్యాకెట్లను పేర్చి ఏపి నుంచి సరుకు మధ్యప్రదేశ్ కు దాటించాలని చూశారు. వైజాగ్ నుంచి అని చెక్పోస్టుల దగ్గర ఇలాగే ఖాళీ లారీని పోలీసులు వదిలిపెట్టారు. కానీ హనుమకొండ పోలీసులు మాత్రం అనుమానంతో తనిఖీ చేశారు  లారీ పైన పరదా కట్టి ఉంటే ఎండ పడకుండా అలా కట్టుకున్నారు అనుకున్నారు. ఆ తర్వాత చెక్ చేస్తే కానీ తెలియలేదు ఆ పరదా కింద అసలు రహస్యం దాగి ఉంది అని. దీంతో 300 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>