Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-7dfeb935-10fe-4d1d-96db-4e568a322d39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-7dfeb935-10fe-4d1d-96db-4e568a322d39-415x250-IndiaHerald.jpgఐశ్వర్య, ధనుష్ విడాకుల విషయంలో యూటర్న్ తీసుకున్నారా.. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ స్టార్ కపుల్. పెద్దల ఆశీస్సులతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు 18 సంవత్సరాల పాటు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడిపారు. అయితే కొన్ని విభేదాల కారణంగా రెండేళ్ల క్రితమే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు, ఇది వారి అభిమానులను బాధించింది. చాలా మంది అభిమానులు వారి మధ్య సయోధ్య కుదిరి తిరిగి కలుస్తారని ఆశించారు. అయితే వీరిద్దరు తమ రిలేషన్ షిప్ నుంచి Movies {#}Naga Chaitanya;aishwarya;raghuvaran;Asuran;Application;Kollywood;Samantha;Nijam;renu desai;Telugu;Tollywood;Hero;marriage;Cinemaఐశ్వర్య, ధనుష్ విడాకుల విషయంలో యూటర్న్ తీసుకున్నారా?ఐశ్వర్య, ధనుష్ విడాకుల విషయంలో యూటర్న్ తీసుకున్నారా?Movies {#}Naga Chaitanya;aishwarya;raghuvaran;Asuran;Application;Kollywood;Samantha;Nijam;renu desai;Telugu;Tollywood;Hero;marriage;CinemaTue, 17 Oct 2023 15:08:00 GMT

ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ స్టార్ కపుల్. పెద్దల ఆశీస్సులతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు 18 సంవత్సరాల పాటు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడిపారు. అయితే కొన్ని విభేదాల కారణంగా రెండేళ్ల క్రితమే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు, ఇది వారి అభిమానులను బాధించింది. చాలా మంది అభిమానులు వారి మధ్య సయోధ్య కుదిరి తిరిగి కలుస్తారని ఆశించారు.

అయితే వీరిద్దరు తమ రిలేషన్ షిప్ నుంచి తప్పుకుని సినీ కెరీర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ మరోసారి కలవబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇది నిజం కాదని తెలుస్తోంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ధనుష్, ఐశ్వర్య  విడిపోయినా ఇంకా విడాకుల కోసం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో కొంత మంది మళ్లీ కలుస్తారేమో అని అనుకున్నారు. కానీ వారు అలా చేసే సూచనలు కనిపించడం లేదు.

ఇప్పటికైనా ప్యాచ్ అప్ అయ్యి మళ్లీ సంతోషంగా జీవించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. వారు మరెవరినైనా వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు.

ధనుష్ "వై దిస్ కొలవెరి డి", "రౌడీ బేబీ" వంటి ఒరిజినల్ పాటలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు.  అతను భారతీయ చలనచిత్రంలో అత్యంత ప్రతిభావంతులైన, విజయవంతమైన నటులలో ఒకరు. రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో కూడా అయిపోయాడు. తెలుగులో సార్ అనే టైటిల్ తో ఒక స్ట్రైట్ మూవీ తీసి హిట్టు కొట్టాడు. అసురన్ వంటి సినిమాలతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డులను గెలుచుకున్నాడు.

హీరో తెలుగులో మరిన్ని సినిమాలు తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం పెద్ద విషయమే కాదు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా కాలం కలిసి సంసారం చేసి నాగచైతన్య , సమంత నుంచి పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ వరకు చాలామంది విడాకులు తీసుకున్నారు. మళ్లీ వీరు కలిసే అవకాశం లేకపోయినా అభిమానులు మాత్రం కలుస్తారేమో అనే ఆశతో బతుకుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>