PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/niger267c8efd-6654-4653-8efb-938cdc232f10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/niger267c8efd-6654-4653-8efb-938cdc232f10-415x250-IndiaHerald.jpgఓవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం.. ఈ నేపథ్యంలో ఓ చిన్న ఊరట. అదేమిటంటే.. ఆఫ్రికా యుద్ధం ప్రస్తుతానికి ఆగిపోయింది. నైగర్ మీద యూరఫ్ దేశాలు దాడులు చేయాలని ఆలోచించాయి. అయితే నైగర్ కు సపోర్టుగా రష్యా ఉండడంతో యుద్ధం మధ్యలోనే ఆగిపోయింది. ఫ్రాన్స్ ఆఫ్రికా దేశాల్లోని ప్రపంచ ఆర్థిక కూటమి ద్వారా నైగర్ పై యుద్ధం చేయాలని ప్రయత్నాలు చేసింది. అయితే నైగర్ కు రష్యా అండగా నిలబడింది. ఆఫ్రికా ఖండంలో యుద్ధం తప్పదని అనిపించింది. ఎందుకంటే అమెరికా, బ్రిటన్ సైన్యాలు అక్కడకి చేరుకుని యుదNIGER{#}France;Ukraine;Russia;warహమ్మయ్య.. ప్రపంచంలో ఒక యుద్ధం ఆగింది?హమ్మయ్య.. ప్రపంచంలో ఒక యుద్ధం ఆగింది?NIGER{#}France;Ukraine;Russia;warTue, 17 Oct 2023 10:01:00 GMTఓవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం.. ఈ నేపథ్యంలో ఓ చిన్న ఊరట. అదేమిటంటే.. ఆఫ్రికా యుద్ధం ప్రస్తుతానికి ఆగిపోయింది. నైగర్ మీద యూరఫ్ దేశాలు దాడులు చేయాలని ఆలోచించాయి. అయితే నైగర్ కు సపోర్టుగా రష్యా ఉండడంతో యుద్ధం మధ్యలోనే ఆగిపోయింది. ఫ్రాన్స్ ఆఫ్రికా దేశాల్లోని ప్రపంచ ఆర్థిక కూటమి ద్వారా నైగర్ పై యుద్ధం చేయాలని ప్రయత్నాలు చేసింది. అయితే నైగర్ కు రష్యా అండగా నిలబడింది. ఆఫ్రికా ఖండంలో యుద్ధం తప్పదని అనిపించింది.


ఎందుకంటే అమెరికా, బ్రిటన్ సైన్యాలు అక్కడకి చేరుకుని యుద్ధం చేయాలని అనుకున్నాయి. నైగర్ లో నియంత పాలన నడుస్తుందని అక్కడ మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామని ఆఫ్రికా కు చెందిన ఆర్థిక కూటమి దేశాలు ప్రయత్నించాయి. యూరఫ్ దేశాలు దీనికి సహకరించగా రష్యా రంగంలోకి దిగడంతో మొత్తం మీద అక్కడ యుద్ద వాతావరణం నెలకొంది.


రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కాస్త దారి తప్పి.. ఇలా ఆఫ్రికా దేశాల యుద్ధాలుగా మారిపోయేలా కనిపించింది. అయితే ప్రస్తుతం అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా మారిపోయింది. అయితే నైగర్ లోని ప్రజలు ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. అక్కడి ప్రభుత్వానికే మద్దతు తెలిపారు. అయితే అక్కడ సైనిక పాలనకు వ్యతిరేకంగా చేయాలనుకున్న యుద్దం కాస్త ఆ దేశ ప్రజలే ఎదురుతిరగడంతో అక్కడ నుంచి ఫ్రాన్స్ దళాలు వెనుదిరగాల్సి వచ్చింది.


ముఖ్యంగా ఫ్రాన్స్ సైనిక పాలనను తొలగించి ప్రజాస్వామ్య పాలనకు కృషి చేస్తామని అనుకున్నారు. కానీ ఫ్రాన్స్ కు అక్కడి దేశంలో ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో రెండు నెలల నుంచి తన అక్కడే ఉన్న తన సైన్యాన్ని ప్రస్తుతం ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఆఫ్రికా యుద్దం ఆగిపోయింది. లేకపోతే అటు రష్యా, ఇటు ఫ్రాన్స్, బ్రిటన్ దళాలు అన్ని కలిస్తే మళ్లీ పెద్ద యుద్ధం వచ్చేది. కాబట్టి యుద్ధం రాకపపోవడమే మంచిది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>