Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanif8e7f8d1-363a-4363-ab67-02e56d5df070-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanif8e7f8d1-363a-4363-ab67-02e56d5df070-415x250-IndiaHerald.jpgఏదైనా పెద్ద పండుగ వచ్చింది అంటే చాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదే రేంజ్ లో పండగ వాతావరణం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక పండక్కి ఎంతో మంది పెద్ద హీరోలు తమ సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో రాబోయే దసరా పండక్కి కూడా ఇలాగే తమ సినిమాలను విడుదల చేసేందుకు పెద్ద హీరోలు సిద్ధమైపోయారు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించడమే కాదు.. అటు ప్రమోషన్స్ లో కూడా మునిగితేలుతూ ఉన్నారు అని చెప్పాలి. ప్రస్తుతం దసరాకి దళపతి విజయ్ లియో, బాలయ్య భగవాన్ కేసరి, రవితేజ టైగNani{#}Christmas;Dalapathi;Prabhas;Nani;Godavari River;Vijayadashami;ravi teja;Dussehra;Ravi;varun tej;Venkatesh;Tollywood;festival;Akkineni Nageswara Rao;september;Father;Joseph Vijay;December;Balakrishna;Cinema;warవరుణ్ తేజ్, నితిన్ లకు.. నాని గట్టి షాకే ఇచ్చాడే?వరుణ్ తేజ్, నితిన్ లకు.. నాని గట్టి షాకే ఇచ్చాడే?Nani{#}Christmas;Dalapathi;Prabhas;Nani;Godavari River;Vijayadashami;ravi teja;Dussehra;Ravi;varun tej;Venkatesh;Tollywood;festival;Akkineni Nageswara Rao;september;Father;Joseph Vijay;December;Balakrishna;Cinema;warMon, 16 Oct 2023 14:15:00 GMTఏదైనా పెద్ద పండుగ వచ్చింది అంటే చాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదే రేంజ్ లో పండగ వాతావరణం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక పండక్కి ఎంతో మంది పెద్ద హీరోలు తమ సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో రాబోయే దసరా పండక్కి కూడా ఇలాగే తమ సినిమాలను విడుదల చేసేందుకు పెద్ద హీరోలు సిద్ధమైపోయారు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించడమే కాదు.. అటు ప్రమోషన్స్ లో కూడా మునిగితేలుతూ ఉన్నారు అని చెప్పాలి. ప్రస్తుతం దసరాకి దళపతి విజయ్ లియో, బాలయ్య భగవాన్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు విడుదల రాబోతున్నాయి.


 మరోవైపు అటు క్రిస్మస్ కి ప్రభాస్ సలార్ సందడి చేయబోతుంది అని చెప్పాలి. అయితే ముందుగా సెప్టెంబర్ లో సలార్ రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ తర్వాత మేకర్స్ డిసెంబర్ 22వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. అయితే ఇప్పుడు సలార్ దెబ్బతో టాలీవుడ్ యంగ్ హీరోల మధ్య వార్ మొదలైంది. టాలీవుడ్ లో ముందు వేసుకున్న లెక్కల ప్రకారం నాని హాయ్ నాన్న మూవీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు అనుకున్న షెడ్యూల్ కంటే రెండు వారాల ముందుగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు  వస్తూ ఉండడం గమనార్హం.


 డిసెంబర్ 7వ తేదీన సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇక క్రిస్మస్ కి రావాల్సిన వెంకటేష్ సైంధవ్ సినిమా పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి వెళ్ళిపోయింది. అయితే డిసెంబర్ 8వ తేదీన వరుణ్ తేజ్ వాలెంటైన్, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాలు షెడ్యూల్ చేశారూ. ఈ రెండు సినిమాల కంటే ఒక్కరోజు ముందుగా ఇప్పుడు హాయ్ నాన్న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదంతా చూస్తుంటే ఈ ముగ్గురు యంగ్ హీరోల మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. ఇక విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అదే తేదీన రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి. దీంతో వరుణ్, నితిన్ సినిమాలలో ఏదో ఒకటి డిసెంబర్ మొదటి వారం నుంచి డ్రాప్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో: డే 1 అన్ని కోట్ల వసూళ్లు ఖాయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>