EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/hamas7a9cebf9-2bc5-4865-8c65-318c1a0caff4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/hamas7a9cebf9-2bc5-4865-8c65-318c1a0caff4-415x250-IndiaHerald.jpgఇజ్రాయెల్ పై హమాస్ మెరుపుదాడి ఒక్క ఆ దేశాన్ని కాకుండా ప్రపంచం మొత్తాన్నే నిర్ఘాంతపరిచింది. నెలల తరబడి పక్కాగా ప్రణాళిక వేసుకొని మరీ చేసిన ఈ దాడి వెనుక ఇదే సమయాన్ని ఎంచుకోవడం కారణాలపై చర్చలు జరుగుతున్నాయి. ఒక రకంగా పాలస్తీనియన్లు పట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వ మితిమీరిన దూకుడు విధానాలే ఈ దాడిని సమర్థించుకునేందుకు హమాస్ కు అవకాశం కల్పించినట్లయింది. పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, నానాటాకి పెరుగుతున్న ఇజ్రాయెల్ దూకుడు ప్రధాన కారణంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. మరొకటి అరబ్ దేశాలతో సాధారణ సhamas{#}Iran;Saudi Arabia;Israel;Dookuduఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక అసలు రహస్యం?ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక అసలు రహస్యం?hamas{#}Iran;Saudi Arabia;Israel;DookuduMon, 16 Oct 2023 09:00:00 GMTఇజ్రాయెల్  పై హమాస్ మెరుపుదాడి ఒక్క ఆ దేశాన్ని కాకుండా ప్రపంచం మొత్తాన్నే నిర్ఘాంతపరిచింది. నెలల తరబడి పక్కాగా ప్రణాళిక వేసుకొని మరీ చేసిన ఈ దాడి వెనుక ఇదే సమయాన్ని ఎంచుకోవడం కారణాలపై చర్చలు జరుగుతున్నాయి. ఒక రకంగా పాలస్తీనియన్లు పట్ల ఇజ్రాయెల్  ప్రభుత్వ మితిమీరిన దూకుడు విధానాలే ఈ దాడిని సమర్థించుకునేందుకు హమాస్ కు అవకాశం కల్పించినట్లయింది.  


పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, నానాటాకి పెరుగుతున్న ఇజ్రాయెల్ దూకుడు ప్రధాన కారణంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. మరొకటి అరబ్ దేశాలతో సాధారణ సంబంధాలకు ఇజ్రాయెల్   చేస్తున్న కృషి కాస్తో కూస్తో ఫలించేలా ఉన్నాయి. ఇవి హమాస్ ను కలవరపాటుకి గురి చేసి ఉండవచ్చు. కొంతకాలంగా పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ పై అరబ్ దేశాల ఒత్తిడి తగ్గుతూ వస్తోంది. ఇదే సమయంలో అరబ్ దేశాల పెద్దన్నగా భావించే సౌదీ అరేబియా ఇజ్రాయెల్ తో పలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమైంది.


దీంతో అప్రమత్తమైన హమాస్ ఇది ఇలాగే కొనసాగితే పాలస్తీనాకు పూర్తి స్వాతంత్ర్యం రాదని భావించి ఉంటుంది. దీంతో పాటు తమకు నిధులు ఇవ్వదని భావించి  ఈ ఒప్పందాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని భావించి ఈ దాడులకు తెగబడినట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై పగ తీర్చుకునేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వస్తోంది. ఈ క్రమంలో హమాస్ కు ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు అవసరమైన సాయుధ, ఆర్థిక తదితర వనరులను సమకూర్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


మరోవైపు ఇజ్రాయెల్ అరబ్ దేశాలతో కలిస్తే ఇద్దరూ ఆర్థికంగా పరిపుష్టులవుతారు. దీంతో చమురు నిల్వల సమస్యలు ఎదురైనప్పుడు అన్ని దేశాలను కలుపుకొని వెళ్తారు. దీంతో అక్కడ ప్రత్యేమ ముస్లిం దేశం అంతమై అన్ని మతాల వారు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ల దేవుడు తప్ప మరే ఇతర దేవుళ్లని వాళ్లు అంగీకరించరు. దీంతోనే పక్కా ప్రణాళికతో దెబ్బకొట్టాలనే దాడి చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య లాస్ట్ 6 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>